
Table of Contents
AP Saderam Reassessment Certificate 2025
AP Saderam Reassessment Certificate 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు మంజూరు చేసే పింఛన్ల పునఃపరిశీలన (Reassessment) అనంతరం కొత్త సదరం సర్టిఫికెట్లు / కార్డులు విడుదల చేసింది. ఈ సర్టిఫికెట్లను గ్రామ / వార్డు సచివాలయం ద్వారా పూర్తిగా ఉచితంగా పొందవచ్చు.
ఈ సదరం సర్టిఫికెట్లు AP Seva Portal ద్వారా డిజిటల్ అసిస్టెంట్ (గ్రామ సచివాలయం) లేదా డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ (వార్డు సచివాలయం) అధికారి డౌన్లోడ్ చేస్తారు.
📜 Saderam Reassessment Certificate Overview
- పథకం పేరు: AP Saderam Reassessment Certificate 2025
- అమలు సంస్థ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
- ప్రయోజనం: పింఛన్ పునఃపరిశీలన అనంతరం అర్హులైన వారికి కొత్త సదరం సర్టిఫికెట్ / కార్డు జారీ
- సర్టిఫికేట్ అందజేత: గ్రామ / వార్డు సచివాలయం ద్వారా ఉచితంగా
- డౌన్లోడ్ పోర్టల్: AP Seva Portal
✅ Key Points
- గతంలో పింఛన్ పునఃపరిశీలనకు వెళ్లిన వారికి మాత్రమే కొత్త సదరం సర్టిఫికెట్లు జారీ అవుతాయి.
- సర్టిఫికెట్లు పూర్తిగా ఉచితం – ఎటువంటి ఛార్జీలు ఉండవు.
- గ్రామ సచివాలయంలో – డిజిటల్ అసిస్టెంట్ అధికారి
వార్డు సచివాలయంలో – డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అధికారి
AP Seva Portal ద్వారా సర్టిఫికెట్ డౌన్లోడ్ చేస్తారు. - ఒకసారి మాత్రమే డౌన్లోడ్ చేసుకునే అవకాశం – మళ్లీ డౌన్లోడ్ ఆప్షన్ ఉండదు.
📂 Required Details
సదరం సర్టిఫికెట్ పొందేందుకు మీకు అవసరమైనవి:
- లబ్ధిదారు పేరు
- ఆధార్ నెంబర్
- పింఛన్ ID (ఉంటే)
- గ్రామం / వార్డు వివరాలు
📌 Download Process
- గ్రామ / వార్డు సచివాలయంకి వెళ్లండి.
- సంబంధిత అధికారి AP Seva Portalలో లాగిన్ అవుతారు.
- Saderam Reassessment Certificate Download ఆప్షన్ ఎంచుకుంటారు.
- లబ్ధిదారు వివరాలు ఎంటర్ చేసి డౌన్లోడ్ చేస్తారు.
- ప్రింట్ తీసుకొని లబ్ధిదారునికి అందజేస్తారు.
🚨 Important Notes
- డౌన్లోడ్ చేసే ముందు వివరాలు సరిగా ఉన్నాయో చెక్ చేయాలి.
- మళ్లీ డౌన్లోడ్ చేసే అవకాశం ఉండదు, కాబట్టి ఒకే సారి ప్రింట్ తీసుకోవాలి.
- ఇది పూర్తిగా ఉచిత సేవ.
📽️ సదరం ఫుల్ డీటెయిల్స్
అందరికీ అర్థం అవ్వాలని ఉద్దేశంతో ఒక డెమో వీడియో కూడా చేశాను.. కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి…
📽️ వీడియో లింక్ :- Click Here
- Auto Driver Sevalo Payment Status | Vahana Mitra Payment Status 2025
- NTR Vidya Lakshmi, Kalyana Lakshmi Scheme : మరో రెండు కొత్త పథకాలు ప్రకటన
- AP Vahanamitra Application Status 2025: మీ వాహన మిత్ర అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి
- AP Pension Distribution September 2025 | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- AP Smart Rice Card Distribution 2025 | జిల్లాల వారీ షెడ్యూల్ & QR కోడ్ వివరాలు
❓ FAQs – Saderam Reassessment Certificate 2025
Q1. ఎవరు ఈ సదరం సర్టిఫికెట్ పొందగలరు?
గతంలో పింఛన్ పునఃపరిశీలనకు వెళ్లి, అర్హత సాధించిన వారు.
Q2. సర్టిఫికెట్ డౌన్లోడ్ ఎక్కడ జరుగుతుంది?
మీ గ్రామ / వార్డు సచివాలయంలో AP Seva Portal ద్వారా.
Q3. ఎటువంటి ఫీజు ఉందా?
లేదు, ఇది పూర్తిగా ఉచితం.
Q4. మళ్లీ డౌన్లోడ్ చేసుకోవచ్చా?
లేదు, ఒకసారి మాత్రమే డౌన్లోడ్ చేసే అవకాశం ఉంటుంది.
🏷️ Tags
AP Saderam Card 2025, Saderam Certificate Download AP, AP Disabled Schemes, AP Seva Portal Services, Andhra Pradesh Saderam New Card, AP Govt Free Certificates