AP Pension Distribution September 2025

AP Pension Distribution September 2025 | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

AP Pension Distribution September 2025

✅ AP Pension Distribution September 2025 – Key Decision by Government

AP Pension Distribution September 2025: ఆంధ్రప్రదేశ్‌లో సెప్టెంబర్ 1న పెన్షన్ల పంపిణీ యథావిధిగా జరుగనుంది. ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ల విషయంలో గత కొన్ని రోజులుగా రాజకీయంగా పెద్ద చర్చ జరుగుతోంది. అర్హత లేని వారు కూడా పెన్షన్లు పొందుతున్నారని క్షేత్ర స్థాయి పరిశీలనలో అధికారులు గుర్తించడంతో, కొందరికి పెన్షన్ తొలగింపు నోటీసులు జారీ చేశారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన, విమర్శలు వ్యక్తమయ్యాయి.

దివ్యాంగుల పెన్షన్లపై భరోసా

WhatsApp Group Join Now

దివ్యాంగుల పెన్షన్ల విషయంలో సెర్ప్ అధికారులు ముఖ్యమైన స్పష్టత ఇచ్చారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సెప్టెంబరులో యథావిధిగా పెన్షన్ అందుతుందని తెలిపారు. నోటీసులు వచ్చిన దివ్యాంగులకు కూడా ఆందోళన అవసరం లేదని, వారికి పెన్షన్లు యథాతథంగా జమ అవుతాయని భరోసా ఇచ్చారు.

ఇటీవల రీవెరిఫికేషన్‌లో 40% కంటే తక్కువ వైకల్యం ఉన్నవారికి మాత్రమే నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికీ, ప్రభుత్వం నోటీసులను వెనక్కు తీసుకొని, ఎవరూ ఇబ్బంది పడకుండా సెప్టెంబరులో అందరికీ పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది.

🔥 పెన్షన్ కన్వర్షన్ ఆప్షన్

వికలాంగ శాతం 40% కంటే తక్కువ ఉన్న కారణంగా పెన్షన్ రద్దయిన వారిలో, విడోవ్ పెన్షన్‌కు అర్హత ఉన్నవారు ఉంటే వారికి WEA లాగిన్ నుండి “Disable → Widow Pension Conversion” చేసేందుకు ఆప్షన్ ఇవ్వబడింది.దీని ద్వారా పెన్షన్ కన్వర్షన్‌కు రైజ్ చేసి, MPDO గారి అప్రూవల్ తర్వాత వారి పెన్షన్ రకం మారుతుంది.

సీఎం చంద్రబాబు ఆదేశాలు

పెన్షన్ల పంపిణీపై వచ్చిన వివాదంపై సీఎం చంద్రబాబు నాయుడు సెర్ప్ అధికారులతో చర్చించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ నిలిపివేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫలితంగా, సెప్టెంబర్ 1 నుంచి సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లు యథావిధిగా పంపిణీ చేయబడతాయి.

భవిష్యత్ నిర్ణయాలు

అనర్హులపై తుది నిర్ణయం సెప్టెంబర్ 4న జరిగే మంత్రివర్గ సమావేశంలో తీసుకోనున్నారు. ప్రభుత్వం స్పష్టం చేసినట్లు –

  • అర్హత ఉన్న ఎవరికీ పెన్షన్ కోత ఉండదు
  • ప్రస్తుతం అమలులో ఉన్న విధంగానే సెప్టెంబర్ నెల పెన్షన్లు పంపిణీ అవుతాయి
  • భవిష్యత్తులో అనర్హుల జాబితాపై స్పష్టమైన కార్యాచరణ చేపడతారు

ముఖ్యాంశాలు (Highlights)

  • 📅 సెప్టెంబర్ 1 నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభం
  • దివ్యాంగులందరికీ పెన్షన్ యథావిధిగా
  • 🛑 నోటీసులను ప్రభుత్వం వెనక్కు తీసుకుంది
  • 🏛️ సెప్టెంబర్ 4న మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం

💵 ఆగస్టు నెల డ్రా తేదీ మార్పు

ఆగస్టు 31 ఆదివారం కావడంతో, ప్రభుత్వం ముందురోజే అంటే శనివారం 30.08.2025న పెన్షన్ అమౌంట్ డ్రా చేయాలని ఆదేశించింది.

🔥 NTR Bharosa Pension Status ✅

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ప్రతి ఒక్కరు మీ పెన్షన్ స్టేటస్ మీ మొబైల్ లోనే తెలుసుకోండి..

📌 ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్టేటస్ : Click Here

📌 లేటెస్ట్ ప్రభుత్వ ఉద్యోగాలు : Click Here

📽️ పెన్షన్ గురించి మరింత సమాచారం కోసం కింద ఉన్న వీడియోని క్లిక్ చేయండి..

📽️ Video Link :- Click Here

AP Pension Distribution September 2025 కి సంబంధించి మరి ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సప్ గ్రూపులో జాయిన్ అవ్వగలరు..

FAQs – AP Pension Distribution September 2025

Q1. సెప్టెంబర్ 1న పెన్షన్లు వస్తాయా?
అవును. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సెప్టెంబర్ నెల పెన్షన్లు యథావిధిగా అందుతాయి.

Q2. దివ్యాంగుల పెన్షన్లు నిలిపివేస్తారా?
లేదు. నోటీసులు వచ్చిన దివ్యాంగులకూ సెప్టెంబర్ నుంచి పెన్షన్లు యథాతథంగా వస్తాయి.

Q3. నోటీసులు ఇచ్చినవారి పరిస్థితి ఏమిటి?
ప్రస్తుతం నోటీసులను ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. భవిష్యత్‌లో మంత్రివర్గ సమావేశం తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారు.

Q4. పెన్షన్లు ఎక్కడ అందిస్తారు?
ప్రతి గ్రామ, వార్డు సచివాలయం ద్వారా పెన్షన్లు పంపిణీ జరుగుతుంది.

🏷️ Related TAGS

AP Pensions September 2025, Andhra Pradesh Pension Distribution, AP Government Decision on Pensions, AP Disabled Pensions, AP Pension Latest News, సెప్టెంబర్ పెన్షన్లు ఏపీ

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Scroll to Top