
Census 2026 India Update
దేశవ్యాప్తంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భారత జనగణన 2026 (Census 2026 India) కు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు దశల్లో జనగణన చేపట్టాలని ఇప్పటికే కేంద్రం ప్రకటించగా, తాజాగా ఏప్రిల్ 1, 2026 నుంచి తొలి దశ జనగణన ప్రారంభం కానుంది. ఈసారి ప్రత్యేకత ఏమిటంటే… జనగణనతో పాటు కులగణన (Caste Census) కూడా చేపట్టనున్నారు.
కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో జనగణన ప్రక్రియను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారు. తొలిదశలో హౌస్ లిస్టింగ్ (Housing Census) చేయనుండగా, రెండో దశలో పూర్తి స్థాయి జనాభా లెక్కలు (Population Enumeration) సేకరిస్తారు.
Census 2026 – రెండు దశలుగా జనగణన ఎలా జరుగుతుంది?
భారత జనగణన 2026 మొత్తం రెండు ప్రధాన దశలుగా నిర్వహించనున్నారు.
తొలి దశ – హౌస్ లిస్టింగ్ (April – September 2026)
👉 ఈ దశలో ప్రతి ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తారు.
👉 ఇల్లు, సౌకర్యాలు, వాహనాలు, టెక్నాలజీ వినియోగం వంటి అంశాలు నమోదు చేస్తారు.
రెండో దశ – జనాభా గణన (February – March 2027)
👉 ఈ దశలో ప్రతి వ్యక్తి వివరాలు నమోదు చేస్తారు.
👉 వయస్సు, విద్య, ఉపాధి, సామాజిక వర్గం, వృత్తి వంటి సమాచారం సేకరిస్తారు.
33 ప్రశ్నలతో గెజిట్ విడుదల – ఇంటి నుంచి ఏం అడుగుతారు?
తొలిదశ జనగణన కోసం కేంద్ర ప్రభుత్వం 33 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని గెజిట్ రూపంలో విడుదల చేసింది. ఈసారి జనగణన చాలా డీటైల్‌గా జరగనుంది.
ఇంటి వివరాలు (House Details)
- ఇంటి నంబర్ (మున్సిపల్ / జనగణన నంబర్)
- జనగణన ఇంటి ప్రత్యేక నంబర్
- ఇంటి నేల నిర్మాణ రకం
- గోడలు ఏ పదార్థంతో ఉన్నాయి
- పైకప్పు ఏ పదార్థంతో ఉంది
- ఇల్లు ఉపయోగం (నివాసం / వ్యాపారం / ఇతర)
- ఇంటి పరిస్థితి (మంచిది / పాడైంది)
కుటుంబ వివరాలు (Family Details)
- కుటుంబ నంబర్
- ఇంట్లో సాధారణంగా నివసించే సభ్యుల సంఖ్య
- కుటుంబ పెద్ద పేరు
- కుటుంబ పెద్ద లింగం
- కుటుంబ పెద్ద వర్గం (SC / ST / ఇతర వర్గాలు)
- ఇల్లు సొంతమా లేదా అద్దెనా
- కుటుంబం ఉపయోగించే గదుల సంఖ్య
- ఇంట్లో ఉన్న వివాహిత జంటల సంఖ్య
నీరు, మరుగుదొడ్డి & సౌకర్యాలు
- తాగునీటి ప్రధాన వనరు
- తాగునీరు సులభంగా లభిస్తుందా లేదా
- విద్యుత్ సౌకర్యం (కరెంట్ / ఇతర)
- టాయిలెట్ సౌకర్యం ఉందా
- టాయిలెట్ రకం
- మురుగు నీరు వెళ్లే అవుట్‌లెట్
- స్నానానికి ప్రత్యేక సౌకర్యం ఉందా
వంట & ఇంధనం వివరాలు
- వంటగది ఉందా / గ్యాస్ కనెక్షన్ ఉందా
- వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం (గ్యాస్ / కట్టెలు / ఇతర)
డిజిటల్ & వాహన వివరాలు (Technology & Vehicles)
- రేడియో / ట్రాన్సిస్టర్
- టెలివిజన్
- ఇంటర్నెట్ సౌకర్యం
- ల్యాప్‌టాప్ / కంప్యూటర్
- ఫోన్ / మొబైల్ / స్మార్ట్‌ఫోన్
- సైకిల్ / స్కూటర్ / బైక్
- కారు / జీప్ / వాన్
ఇతర కీలక వివరాలు
- ఇంట్లో ప్రధానంగా వినియోగించే ఆహార ధాన్యం
- జనగణన సమాచారం కోసం మాత్రమే మొబైల్ నంబర్
👉 గమనిక: ఈ సమాచారం మొత్తం జనగణన అవసరాల కోసమే ఉపయోగించబడుతుంది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు.
ఏపీలో జనగణన షురూ – అడ్డుకుంటే జైలు శిక్ష!
ఆంధ్రప్రదేశ్‌లో జనగణన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఈ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తే లేదా తప్పుడు సమాచారం ఇస్తే భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తారు అని ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది.
✔ జనగణన అధికారుల విధులను అడ్డుకుంటే
✔ కావాలని తప్పుడు వివరాలు ఇస్తే
✔ సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తే
👉 చట్టపరమైన చర్యలు తప్పవు.
డిజిటల్ Census 2026 – ఎందుకు ఇది చాలా ముఖ్యం?
ఈ జనగణన ఆధారంగా భవిష్యత్తులో:
- ప్రభుత్వ పథకాలు
- రిజర్వేషన్లు
- అభివృద్ధి ప్రణాళికలు
- సంక్షేమ పథకాల కేటాయింపులు
- మౌలిక సదుపాయాల అభివృద్ధి
అన్నీ నిర్ణయించబడతాయి. అందుకే ప్రతి పౌరుడు నిజమైన, ఖచ్చితమైన సమాచారం ఇవ్వడం అత్యంత అవసరం.
జనగణన సర్వే ఫుల్ డీటెయిల్స్
అందరికీ అర్థం అవ్వాలని ఉద్దేశంతో ఒక డెమో వీడియో చేశాను క్రింద ఉన్న లింకును క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి.
📽️ Demo Video : Click Here
✅ Important Link’s
అందరికీ ఉపయోగపడే ముఖ్యమైన సమాచారం క్రింద ఉన్న టేబుల్ లో ఉంది చెక్ చేయగలరు.
| 🔥 50% సబ్సిడీ లోన్స్ రిలీజ్ | Click Here |
| 🔥 పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు రిలీజ్ | Click Here |
| 🔥 రైతులకు 2000 రూపాయలు రిలీజ్ అప్డేట్ | Click Here |
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
Census 2026 ఎప్పుడు ప్రారంభమవుతుంది?
👉 తొలి దశ ఏప్రిల్ 1, 2026 నుంచి ప్రారంభమవుతుంది.
ఈసారి కులగణన జరుగుతుందా?
👉 అవును. జనగణనతో పాటు కులగణన కూడా జరుగుతుంది.
జనగణన డిజిటల్‌గా జరుగుతుందా?
👉 అవును. తొలిసారిగా పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తారు.
తప్పుడు సమాచారం ఇస్తే ఏమవుతుంది?
👉 జరిమానా + జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
ఈ సమాచారం ఎక్కడ ఉపయోగిస్తారు?
👉 కేవలం ప్రభుత్వ ప్రణాళికలు, అభివృద్ధి కార్యక్రమాల కోసం మాత్రమే.
Tags: Census 2026 India, Census 2026 April 1, India caste census update, Census house listing questions, Andhra Pradesh census 2026, digital census India, census 33 questions Telugu, census latest news Telugu
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇