AP 1B Download Online 2026: MeeBhoomi Portalలో 1B/ROR రికార్డు ఎలా చూడాలి, PDF Download లేదా Print ఎలా తీసుకోవాలి?

AP 1B Download Online 2026

AP 1B Download Online 2026: MeeBhoomi Portalలో 1B/ROR రికార్డు ఎలా చూడాలి, PDF Download లేదా Print ఎలా తీసుకోవాలి?

AP 1B (ROR-Record Of Rights) అనేది ఆంధ్రప్రదేశ్ లోని భూమి హక్కులు మరియు యాజమాన్య వివరాలను చూపించే ముఖ్యమైన రెవెన్యూ డాక్యుమెంట్. అయితే దీని గురించి పూర్తి వివరాలు.. ఇంటి వద్ద నుండే మొబైల్ ద్వారా ఎలా డౌన్లోడ్ చేయాలి.. వంటి పూర్తి వివరాలు ఈ పేజీ లో తెలుసుకుందాం.

WhatsApp Group Join Now

ప్రధానంగా ఈ పేజీలో మనం ఆన్లైన్లో భూమి ఉందా లేదా, ఉంటే ఎంత భూమి మీ పేరు మీద ఉంది, అలాగే మీ 1b, పాసు బుక్ కూడా ఇక్కడి నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చును. ఆ ప్రాసెస్ చూద్దాం వీలైతే మీ తోటి మిత్రులకు షేర్ చేసి డైలీ అప్డేట్స్ కోసం మా వాట్సాప్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.

What Is 1B (ROR)

సాధారణంగా మన భూమి యొక్క యాజమాన్య వివరాలను సులభంగా తెలుసుకోవడానికి ఉపయోగపడేదే ఈ 1b డాక్యుమెంట్, దీనిని Record Of Rights(ROR) అని కూడా అంటారు. అయితే ఈ 1B లో ఏ వివరాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

  • పట్టాదారు పేరు
  • తండ్రి/భర్త పేరు
  • జిల్లా పేరు
  • మండలం పేరు
  • గ్రామం పేరు
  • సర్వే నెంబర్
  • భూమి రకం
  • ఖాతా నెంబర్
  • భూమి విస్తీర్ణం.

1B Benefits

ఈ 1బి డాక్యుమెంట్ అనేది భూమి కి సంబంధిత పనులకు ఎంత గానో ఉపయోగపడుతుంది. అయితే కొన్ని ముఖ్యమైన ఉపయోగాలను ఇప్పుడు తెలుసుకుందాం.

  • భూమి రికార్డులను పరిశీలించడానికి
  • బ్యాంక్/వ్యవసాయ లోన్
  • భూమి యాజమాన్య వివరాలను ధృవీకరించడానికి
  • భూమికి సంబంధించి రెవెన్యూ వ్యవహారాల్లో
  • భూమి కి సంబంధించిన వివాదాల్లో రికార్డులను పరిశీలించడానికి.

How To Download 1B Online 2026

Step 1 : ముందుగా MeeBhoomi అఫిషియల్ పోర్టల్ ను ఓపెన్ చేయండి.

AP ROR 1B Download Online

Step 2 : మీ మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేసి, గెట్ OTP పై క్లిక్ చేయండి.

Step 3 : మీ మొబైల్ నెంబర్ కి వచ్చిన OTP ను ఎంటర్ చేసి, Captcha ను కూడా ఎంటర్ చేయాలి. తద్వారా లాగిన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది.

Step 4 : హోం పేజీలో ఉన్న 1B/గ్రామ 1B అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

MeeBhoomi ROR 1B

Step 5 : అక్కడ మీ జిల్లా, మండలం, గ్రామం ను ఎంచుకోండి. ఆ తర్వాత పట్టాదారు పేరు ను ఎంటర్ చేయాలి.

AP 1B Download

Step 6 : ఆ తర్వాత పట్టాదారు నేమ్ పక్కన ఉన్న చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి.

Step 7 : ఇప్పుడు పట్టాదారు పేరు ను ఎంచుకోండి.

Step 8 : మీకు మీ 1B రిపోర్ట్ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అక్కడ 1B డౌన్లోడ్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. దాని పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేయవచ్చును.

AP 1B Download Online 2026

Difference Between 1B and Adangal

1B కి మరియు అడంగల్ కి మధ్య ఉన్న ప్రధానమైన తేడాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1B(ROR)Adangal
పట్టాదారు పేరుసాగు రకం
యాజమాన్య వివరాలుపంటలు మరియు సాగు వివరాలు
లీగల్ ఉపయోగంవ్యవసాయ ఉపయోగం
సర్వే నెంబర్వ్యవసాయ సమచారం
బ్యాంకు రుణాలు రిజిస్ట్రేషన్ మరియు భూమి విక్రయాలకు ఇది చాలా ముఖ్యంపంట నష్టపరిహారం, పీఎంకిసాన్, మరియు సాగు ధ్రువీకరణ కోసం చాలా ముఖ్యం.
1B సమాచారం కాలానుసారం మారదు భూమార్పిడి జరిగినప్పుడు మాత్రమే మారుతుంది.పంట సాగును అనుసరించి కాలానుసారం మారుతుంది
వండి అనేది ఒక వ్యక్తికి ఒక రెవెన్యూ గ్రామంలో ఉన్న మొత్తం భూమి సమాచారం తెలియజేస్తుంది.ఒక సర్వే/LPN కి సంబంధించిన సాగు వివరాలను తెలియజేస్తుంది.

No Exam Govt Jobs Release : Click Here

Issues While Downloading 1B

1B డాక్యుమెంట్ ని డౌన్లోడ్ చేసుకునే సమయంలో వచ్చే సాధారణమైన సమస్యలు మరియు వాటికి పరిష్కారాలు ఇప్పుడు చూద్దాం.

  • OTP రాకపోతే – ఒకసారి మీ మొబైల్ నెట్వర్క్ చెక్ చేసుకుని, కొంత సమయం తర్వాత మళ్లీ ప్రయత్నించాలి.
  • పట్టాదారు పేరు కనిపించకపోతే – మీరు ఎంటర్ చేసిన జిల్లా లేదా గ్రామం పేరు మళ్లీ ఒకసారి చెక్ చేసి, ఎంపిక చేసుకోండి.
  • సర్వర్ బిజి – చాలా సందర్భాలలో సర్వర్ బిజీ అని వస్తుంది దీనికి కారణం ఎక్కువమంది ఒకే సమయంలో వెబ్సైట్ ని ఓపెన్ చేయడం ద్వారా ఇలా వస్తుంది. రాత్రి సమయంలో వెబ్సైట్ ని ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి.

📄 AP 1B Download Online 2026

ఆంధ్రప్రదేశ్ 1B / ROR Land Record వివరాలను ఆన్‌లైన్‌లో చూడడానికి మరియు అందుబాటులో ఉంటే PDF Download లేదా Print తీసుకోవడానికి క్రింది బటన్‌పై క్లిక్ చేయండి.

📥 AP 1B Download / Check Now

ఆన్లైన్ ద్వారా 1B డాక్యుమెంట్ నీ డౌన్లోడ్ చేయడం ఎలా?

ఆంధ్రప్రదేశ్ మీ భూమి అఫీషియల్ పోర్టల్ ద్వారా మీ మొబైల్ లో సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

1B మరియు అడంగల్ ఒకటేనా?

కాదు. ఇవి రెండు వేరు మరియు వీటిలో ఉండే వివరాలు కూడా వేరు.

1B డౌన్లోడ్ చేసుకోవడానికి ఫీజు ఎంత?

దీనిని డౌన్లోడ్ చేసుకోవడానికి ఎటువంటి ఫీజు అవసరం లేదు. ఈ మొబైల్ ద్వారా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

TAGS : AP 1B Download Online 2026, AP 1B Download, AP ROR 1B Download Online, ROR 1B Andhra Pradesh, MeeBhoomi 1B Download, MeeBhoomi ROR 1B, AP Land Records 2026, AP Land Ownership Details, AP 1B PDF Download

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now

Leave a Comment

?>