
AP Ration Card Status Check 2026
ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ముఖ్యమైన సమాచారం. ఇక మీరు రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు అన్ని ఉన్నాయా? కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? మీ కార్డు ఈ కేవైసీ అయిందా లేదా రేషన్ కార్డుకు సంబంధించి పూర్తి వివరాలు మీ మొబైల్ లోనే ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చును.
| AP Ration Card Status Check 2026 – Overview | |
|---|---|
| సేవ పేరు | AP Ration Card Details |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| సంబంధిత శాఖ | Food & Civil Supplies Department |
| అధికారిక పోర్టల్ | ePOS AP |
| సేవ రకం | Online |
| అవసరమైన వివరాలు | RC Number / Rice Card ID |
| ఉపయోగం | కార్డు, కుటుంబ సభ్యుల వివరాల పరిశీలన |
| eKYC సమాచారం | పోర్టల్లో అందుబాటులో ఉన్న మేరకు |
| అధికారిక లింక్ | Check Ration Card Details ↗ |
How to Check Ap Ration Card Details Online?
మీ రేషన్ కార్డు వివరాలను మొబైల్ లో చెక్ చేయడానికి క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి.
Step 1 : ముందుగా ఆంధ్రప్రదేశ్ Epos అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయండి. కింద చూపించిన ఇమేజ్ ని మీద రిఫరెన్స్ గా చూడొచ్చు.

Step 2 : వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు smart PDS పేజీ కనిపిస్తుంది.
Step 3 : అందులో Ration Card Analysis అనే ఆప్షన్ ను ఎంచుకోండి.
Step 4 : ఇప్పుడు Select State అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో Andhra Pradesh రాష్ట్రాన్ని ఎంచుకోండి.
Step 5 : తర్వాత Enter RC ID అనే బాక్స్ లో మీ రేషన్ కార్డు నెంబర్ (RC Number) నమోదు చేయండి.
Step 6 : వివరాలు సరిగ్గా నమోదు చేసిన తర్వాత అక్కడ కనిపించే సబ్మిట్ / serch ఆప్షన్ పై క్లిక్ చేయండి.
Step 7 : తర్వాత మీరు రేషన్ కార్డుకు సంబంధించి పూర్తి వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి దీనికి సంబంధించిన ఇమేజ్ కూడా కింద ఉంది చెక్ చేయండి.
Step 8 : మీ కుటుంబ సభ్యుల వివరాలు ఒకసారి పరిశీలించండి. కుటుంబ యజమాని పేరు, ఇతర కుటుంబ సభ్యుల పేర్లు, మీకు సంబంధించిన రేషన్ షాప్ వివరాలు, ఆధార్ సీడింగ్, ekyc స్టేటస్ వివరాలన్నీ తెలుసుకోవచ్చును.

మీ కుటుంబంలో ఉన్న సభ్యులందరి పేర్లు సరిగా ఉన్నాయో లేదో ఒకసారి తప్పనిసరిగా చెక్ చేయండి.
Ration Card Details ద్వారా ఏయే వివరాలు తెలుసుకోవచ్చు?
ePos పోర్టల్ లో మీ RC ID ద్వారా అందుబాటులో ఉన్న వివరాలను పరిశీలించవచ్చు.
| వివరాలు | ఉపయోగం |
| Retion Card Number | మీ కార్డు గుర్తింపు నెంబర్ |
| Head OF Family | కుటుంబ పెద్ద వివరాలు |
| Family Members | కుటుంబ సభ్యుల పేర్లు |
| District Details | జిల్లా సంబంధిత వివరాలు |
| FPS Datails | రేషన్ షాప్ సమాచారం |
| Aadhaar Seeding | ఆధార్ అనుసంధానా వివరాలు |
| EKYC status | అందుబాటులో ఉండే EKYC |
ముఖ్యంగా కుటుంబ సభ్యుల వివరాలు పరిశీలించడం ద్వారా కొత్తగా చేర్చిన సభ్యుల పేర్లు నమోదయిందా లేదా తెలుసుకోవచ్చు.
Ration Card Inactive లేదా eKYC Pending ఉంటే ఏం చేయాలి?
మీ రేషన్ కార్డు వివరాల్లో ఏదైనా సమస్య కనిపిస్తే వెంటనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ముందుగా సమస్య ఏమిటో గుర్తించి సంబంధిత అధికారాలను సంప్రదించాలి.
EKYC Pending ఉంటే:
సంబంధిత రేషన్ డీలర్ సంప్రదించి కుటుంబ సభ్యుల EKYC స్థితిని పరిశీలించండి.
కుటుంబ సభ్యుల పేర్ల కనిపించకపోతే:
కొత్తగా పేర్లు చేర్చిన తర్వాత వివరాలు ఇంకా అప్డేట్ కాకపోవచ్చు. దరఖాస్తు రిఫరెన్స్ నెంబర్ తో గ్రామా లేదా సచివాలయం లో విచారించండి..
ఆధార్ వివరాలు తప్పుగా ఉంటే:
ఆధార్ అనుసంధానంలో సమస్య ఉంటే సంబంధిత సచివాలయం లేదా పౌరసరఫరాల అధికారులను సంప్రదించి సవరణ ప్రక్రియ గుర్తించి తెలుసుకోండి.
కార్డు వివరాలు కనిపించకపోతే:
RC ID సరిగ్గా నమోదు చేశారో లేదో పరిశీలించండి. అయినా వివరాలు కనిపించకపోతే సంబంధిత రేషన్ డీలర్ లేదా సచివాలయాన్ని సంప్రదించండి.
గమనిక: ఆన్లైన్లో వివరాలు కనిపించకపోవడం మాత్రమే ందని అర్థం కాదు Inactive అని కనిపించిన దాని కారణాన్ని అధికారుల ద్వారా నిర్ధారించుకోవాలి.
AP Ration Card లో కొత్త సభ్యులను చేర్చడం, తొలగించడం ఎలా?
రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల వివరాలను మార్చుకోవడానికి కూడా ఆంధ్రప్రదేశ్లో పౌరసరఫరలు సేవలు అందుబాటులో ఉన్నాయి.
ప్రభుత్వం అందుబాటులో ఉంచిన సేవల ముఖ్యమైనవి:
- New Rice Card -కొత్త రేషన్ కార్డు.
- Member Addition -కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం.
- Member Deletion -సభ్యుల పేర్లను తొలగించడం
- Rice Card Split -కుటుంబ కార్డు విభజన.
- Surrender of Rice Card – రేషన్ కార్డు సరెండర్.
- Change of Address – చిరునామా మార్పు.
- Aadhaar Seeding Correction – ఆధార్ అనుసంధానం వివరాల సవరణ.
ఈ సేవలకు గ్రామ, వార్డు సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత సేవలకు అవసరమైన పత్రాలు, రుసుములు, గడువులను దరఖాస్తు సమయంలో తెలుసుకోవాలి.
🔗 ముఖ్యమైన లింకులు – Quick Links
Frequently Asked Questions (FAQs)
1. How to Check AP Ration Card Status Online?
ఆంధ్రప్రదేశ్ EPOS అధికారిక వెబ్ సైట్ లో Ration Card Analysis విభాగాన్ని ఎంచుకొని, రాష్ట్రం మరియు Rc ID నమోదు చేయడం ద్వారా కార్డు వివరాలను పరిశీలించవచ్చు.
2.What is RC ID In Ration Card?
RC ID అనేది రేషన్ కార్డును గుర్తించడానికి ఉపయోగించే ప్రత్యేక గుర్తింపు నెంబర్. మీ రేషన్ కార్డు పై లేదా సంబంధిత అధికారిక రికార్డులో ఈ నెంబర్ ఉంటుంది.
3. Can I Check Family Members Details Online?
అవును మీ రేషన్ కార్డు నెంబర్ ద్వారా పోర్టల్ లో అందుబాటులో ఉన్న కుటుంబ సభ్యుల వివరాలను ఆన్లైన్లో పరిశీలించవచ్చు.
4.How to Check Ration Card Status In AP?
EPOS వెబ్ సైట్ లో మీ రేషన్ కార్డు వివరాలను చెక్ చేసి, అందుబాటులో ఉన్న ఈకేవైసీ లేదా ఆధార్ సీడింగ్ సమాచారాలని పరిశీలించవచ్చు.
5. What to Do If My Ration Card Details Are Not Showing?
ముందుగా RC ID సరిగ్గా నమోదు చేశారో లేదో చూడండి. అయినా వివరాలను కనిపించకపోతే రేషన్ డీలర్ లేదా గ్రామ వార్డు సచివాలయాన్ని సంప్రదించండి.
TAGS : AP Ration Card, AP Rice Card, Ration Card Status 2026, ePOS AP, RC Details, AP Civil Supplies, Ration Card Family Members, AP Ration Card eKYC, Andhra Pradesh Government Services.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇
2 thoughts on “AP Ration Card Status Check 2026: రేషన్ కార్డు వివరాలు, కుటుంబ సభ్యుల పేర్లు ఆన్లైన్లో ఇలా చెక్ చేసుకోండి!”