Kisan Credit Card (KCC): రైతులకు తక్కువ వడ్డీకి వ్యవసాయ రుణాలు, అర్హతలు, ప్రయోజనాలు అప్లై విధానం పూర్తి వివరాలు!

Kisan Credit Card

వ్యవసాయం చేయడానికి రైతులకు పెట్టుబడి చాలా అవసరం. విత్తనాలు కొనుగోలు చేయడం, ఎరువులు, పురుగు మందులు, సాగునీటి ఖర్చులు, వ్యవసాయ యంత్రాలు నిర్వహణ అంటే అవసరాల కోసం రైతులు తరచూ అప్పులు చేయాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్యమైన పథకమే Kisan Credit Card (KCC) Scheme.

WhatsApp Group Join Now

అయితే KCC కార్డు అంటే ఏమిటి? రైతులకు ఎంత రుణం లభిస్తుంది? ఎవరు అర్హులు? ఏ పత్రాలు అవసరం? బ్యాంకులో ఎలా అప్లై చేసుకోవాలి? వడ్డీ రాయితీ ఎలా లభిస్తుంది? అనే పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం. ప్రతిరోజు డైలీ అప్డేట్స్ కోసం మా వాట్సాప్ గ్రూప్ ని ఫాలో అవ్వగలరు.

Kisan Credit Card (KCC) Scheme – Overview
వివరాలుసమాచారం
పథకం పేరుKisan Credit Card Scheme
తెలుగులోకిసాన్ క్రెడిట్ కార్డు
ప్రారంభించిన సంవత్సరం1998
ప్రధాన ఉద్దేశంరైతులకు వ్యవసాయ అవసరాల కోసం సకాలంలో రుణ సదుపాయం కల్పించడం
అమలు చేసే సంస్థలుకమర్షియల్ బ్యాంకులు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRBs), Small Finance Banks
అర్హులువ్యవసాయ భూమి కలిగిన రైతులు, కౌలు రైతులు, షేర్ క్రాపర్లు, SHGs మరియు JLGs
రుణ ప్రయోజనంపంట సాగు, పంట కోత తర్వాత ఖర్చులు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు
దరఖాస్తు విధానంOnline / Offline
దరఖాస్తు స్థలంసంబంధిత బ్యాంకు శాఖ లేదా బ్యాంకు అధికారిక వెబ్‌సైట్
అధికారిక సమాచారం RBI / NABARD / MyScheme

What is Kisan Credit Card Scheme?

కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని 1998లో రైతులకు సులభంగా వ్యవసాయ రుణాలు అందించాలని ఉద్దేశంతో ప్రారంభించారు. సాధారణంగా రైతులు పంట సాగు ప్రారంభించే సమయంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేయడానికి డబ్బుల అవసరమవుతాయి. ఏ అక్షరాల కోసం ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అధిక వడ్డీకి అప్పులు చేయకుండా బ్యాంకుల ద్వారా రుణం పొందేందుకు KCC ఉపయోగపడుతుంది.

ఈ పథకం కింద బ్యాంకులు రైతులకు వారి సాగు విస్తీర్ణం, పంట రకం, సాగు ఖర్చులు, బ్యాంకు నిబంధనలను పరిగణలోకి తీసుకొని రుణ పరిమితిని నిర్ణయిస్తారు. KCC ద్వారా అర్హత కలిగిన రైతులకు క్రెడిట్ సదుపాయం కల్పిస్తారు. అవసరమైనప్పుడు నిర్ణయించిన పరిమితిలో డబ్బులు ఉపయోగించుకొని, బ్యాంకు నిబంధన ప్రకారం తిరిగి చెల్లించవచ్చు.

What Are the Benefits of Kisan Credit Card?

కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రైతులకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి.

1. వ్యవసాయ పెట్టుబడులకు రుణం

పంట సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేయడానికి రుణ సదుపాయం ఉంటుంది.

2. సాగునీటి ఖర్చులు

పంటలకు నీరు అందించేందుకు అవసరమైన సాగునీటి ఖర్చులు, వ్యవసాయ నిర్వహణ అవసరాలకు నిధులు ఉపయోగించుకోవచ్చు.

3. వ్యవసాయ పరికరాలు

వ్యవసాయ పనులకు అవసరమైన కొన్ని పరికరాలు, యంత్రాల నిర్వహణకు సంబంధించిన అవసరమైన ఖర్చులకు రుణము ఉపయోగపడుతుంది.

4. పంట కోత తర్వాత ఖర్చులు

పంట కోత, నిల్వ, రవాణా, మార్కెటింగ్ వంటి అవసరమైన అవసరాలకు రెండు సదుపాయం ఉంటుంది

5. పశుశోషణ పాడి పరిశ్రమ

పాడి పశువుల నిర్వహణ, పశువుల దాన పౌల్ట్రీ ఇతర వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు కూడా అర్హులు మేరకు రుణం పొందవచ్చు.

6. మత్స్య పారిశ్రమ

చేపల పెంపకం చేపల వేటకు సంబంధించిన అర్హులమైన నిర్వహణ ఖర్చులు కూడా kcc ఉపయోగపడుతుంది.

What Can Farmers Use kcc Loan For?

కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ క్రింది వ్యవసాయ అవసరాలకు రుణాన్ని ఉపయోగించుకోవచ్చు.

వ్యవసాయ అవసరాలుఉపయోగం
Seedsవిత్తనాలు కొనుగోలు
Fertilizersఎరువు కొనుగోలు
pesticidesపురుగు మందుల కొనుగోలు
Lrrigationసాగునీటి అవసరాలు
Agriculturat Equipmentవ్యవసాయ పరికరాలు అన్ని
Dairy Farmingపాడి పరిశ్రమ
poultry Farmingకోళ్లు పెంపకం
Fisheriesచేపల పెంపకం
other Farm Activitiesఇతర అర్హమైన వ్యవసాయ కార్యకలాపాలు

అయితే ఏ ఖర్చులకు ఎంత రుణం మంజూరు చెయ్యా లనేది బ్యాంక్ కి సంబంధిత పథకాలు నిబంధనల ప్రకారం నిర్ణయిస్తారు.

kcc Loan Limit-రైతులకు ఎంత రుణం లభిస్తుంది?

kcc ద్వారా రైతులకు ఎంకరుణం లభిస్తుందని చాలామందికి ఉండే ముఖ్యమైన సందేహం

కేంద్ర ప్రభుత్వం 26 మార్చి 11న విడుదల చేసిన సమాచార ప్రకారం Modified lnterest subvention Scheme కింది kcc రుణ పరిమితిని రూ.5 లక్షలకు పెంచినట్లు పేర్కొంది అలాగే అర్హత కలిగిన రుణాలకు కలెక్టర్ లేకుండా పొందగలరు పరిమితి ఒక్కో రుణ గ్రహీతలకు రూ.2 లక్షలకు పెంచినట్లు వెల్లడించింది.

అయితే ఈ వివరాలను ఇలా అర్థం చేసుకోవాలి:

  • రూ.5 లక్షలు అనేది ప్రతి రైతులకు ఆటోమేటిక్గా మంజూరయ్యే రుణం కాదు
  • రైతు అర్హత, పంట, సాగు విస్తీర్ణం, రుణ అవసరాలు, బ్యాంకు పరిశీలన ఆధారంగా రుణ పరిమితి నిర్ణయిస్తారు
  • కలెటరల్ లేకుండా రుణం పొందే పరిమితి మొత్తం kcc రుణ పరిమితి రెండో వేర్వేరు అంశాలు.
  • బ్యాంకు నిర్ణయించిన సంబంధాలను పాటించాలి.

అందువల్ల మీకు ఎంత రుణం వస్తుందో తెలుసుకోవడానికి సంబంధిత బ్యాంకును సంప్రదించాలి.

Kcc Loan lnterest Rate-వడ్డీ రాయితీ వివరాలు

కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకంలో రైతులకు వడ్డీ రాయితీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న Modified lnterest subvention Scheme (Mlss) క్రింద అర్హత కలిగిన స్వల్పకాలిక వ్యవసాయ రుణాలకు వడ్డీ రాయితీ అందించే విధానం ఉంది.

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన RBl మార్గధర్మకాల ప్రకారం:

  • బ్యాంకుల ద్వారా అర్హమైన స్వల్పకాలిక వ్యవసాయ రుణాలకు 1.50% వడ్డీ రాయితీ కల్పిస్తారు.
  • సకాలంలో రుణం చెల్లించే అర్హులైన రైతులకు అదనంగా 3% prompt Repayment lncentive ఉంది
  • నిర్దిష్ట అర్హతలు, పరిమితులకు తోబడి రైతులకు సంవత్సరానికి 4% వడ్డీతో రుణం లభించే అవకాశం ఉంటుంది

ముఖ్యమైన విషయం: ఈ 4% వడ్డీ ప్రయోజనం అన్ని kcc రుణాలకు అన్ని సంవత్సరాలకు ఆటోమేటిక్గా వర్తించిదు రుణం రకం ఆర్థిక సంవత్సరం అర్హతలు, తిరిగి చెల్లింపు గడువు ఆధారంగా ప్రయోజనం మారుతుంది.2026-27 సంవత్సరానికి వర్తించే తాజా వడ్డీ నిబంధనలు బ్యాంకులో నిర్ణయించుకోవాలి.

Who Is Eligible for Kisan credit card?

కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం ఈ క్రింది వర్గాలను వారు అర్హులు పొందవచ్చు.

  1. సొంత భూమిలో వ్యవసాయం చేసే రైతులు.
  2. వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా వ్యవసాయం చేసే రైతులు.
  3. కౌలు రైతులు (Tenant Farmers).
  4. మౌలిక కవులు రైతులు(oral Lessees).
  5. కవులు పై సాగు చేసే వాటా ద్వారులు (Sharecroppers).
  6. రైతుల స్వయం సహాయక సంఘాలు (SHGs).
  7. జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ (JLGs).

కౌలు రైతులు, వాటాదారులు కూడా నిర్దేశించిన అర్హతలు, అవసరమైన ధృవీకరణ ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

Documents Required for KCC Application

KCC కార్డు కోసం బ్యాంకులో దరఖాస్తు చేసుకునే సమయంలో సాధారణంగా క్రింది పత్రాలు అవసరమవుతాయి.

  • ఆధార్ కార్డు
  • గుర్తింపు ధ్రువీకరణ పత్రం
  • చిరునామా ధ్రువీకరణ పత్రం
  • పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
  • భూమి యజమాని పత్రాలు లేదా సాగుకు సంబంధించిన ఆధారాలు
  • పంట వివరాలు
  • సాగు విస్తీర్ణం వివరాలు
  • కౌలు రైతులకు వర్తించే సాగు ధ్రువకరణ పత్రాలు
  • బ్యాంకు కోరిన ఇతర పత్రాలు.

పత్రాల జాబితా బ్యాంకు, రైతు అర్హత, రుణ రకం ఆధారంగా మారవచ్చు.

Offline Application Process

Step 1 : ముందుగా మీకు సమీపంలోని బ్యాంకు లేదా సహారా బ్యాంకును సందర్శించండి.

Step 2 : అక్కడ Kisan Credit Card Application Form అడిగి తీసుకోండి.

Step 3 : దరఖాస్తులో రైతు వ్యక్తిగత వివరాలు, భూమి వివరాలు, పంట వివరాలను నమోదు చేయండి.

Step 4 : ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు, భూమి పత్రాలు వంటి అవసరమైన డాక్యుమెంట్లను జత చేయండి.

Step 5 : పూర్తి చేసిన దరఖాస్తును బ్యాంకులో సమర్పించండి.

Step 6 : బ్యాంక్ అధికారులు మీ అర్హత, భూమి, పంట వివరాలను పరిశీలిస్తారు.

Step 7 : అర్హత నిర్ధారణ తర్వాత బ్యాంకు నిర్ణయించిన రుణ పరిమితిని మంజూరు చేస్తుంది. ఆ తర్వాత KCC ఖాతా లేదా కార్డు సదుపాయం అందుబాటులోకి వస్తుంది.

Online Application Process

కొన్ని బ్యాంకులు KCC కోసం ఆన్లైన్ దరఖాస్తు సదుపాయాన్ని కూడా అందిస్తున్నాయి.

  • మీ బ్యాంక్ అధికారిక వెబ్సైటు సందర్శించండి.
  • Agriculture Loans లేదా Kisan Credit Card విభాగాన్ని ఎంచుకోండి.
  • KCC అప్లికేషన్ లింకు పై క్లిక్ చేయండి.
  • అవసరమైన వివరాలను నమోదు చేయండి.
  • సూచించిన పత్రాలను అప్లోడ్ చేయండి.
  • అప్లికేషన్ సబ్మిట్ చేసి రిఫరెన్స్ నెంబర్ భద్రపరచుకోండి.
  • బ్యాంకు నుంచి వచ్చే తదుపరి సూచనలను అనుసరించండి.

ఆన్లైన్ దరఖాస్తు సదుపాయం లేని బ్యాంకుల్లో నేరుగా బ్రాంచ్ ను సంప్రదించాలి.

Important points Farmers Should Remember

KCC రుణం తీసుకునే ముందు రైతులకు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తించుకోవాలి.

  • kcc అనేది వ్యవసాయ రుణం సదుపాయం మాత్రమే ఉచితంగా డబ్బులు ఇచ్చే పథకం కాదు.
  • రుణ పరిమితిని బ్యాంక్ నిర్ణయిస్తుంది.
  • వడ్డీ రేటు రుణ కాలపరిమితిని తిరిగి చెల్లింపు నిబంధనలును ముందుగానే తెలుసుకోవాలి
  • సకాలంలో రుణం చెల్లిస్తే అర్హుల మేరకు వడ్డీ రాయితీ లభించవచ్చు
  • రుణం కోసం సమర్పించే పత్రాలు నిజమైనవిగా ఉండాలి.
  • బ్యాంకు అధికారిక రసీదు లేకుండా ఎవరికి డబ్బులు చెల్లించకూడదు
  • WhatsApp ద్వారా వచ్చే అనధికారిక లింకులు, నకిలీ kcc ఆఫర్లను నమ్మకూడదు

FAQs of The Post

1. What is Kisan Credit Card Scheme?

కిసాన్ క్రెడిట్ కార్డు పథకం అనేది రైతులకు వ్యవసాయ అవసరాలకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించే పథకం.

2. Who can apply for KCC?

సొంత భూమిలో వ్యవసాయం చేసే రైతులు, కౌలు రైతులు, వాటాదారులు, అర్హత కలిగిన SHGలు, JLGలు దరఖాస్తు చేసుకోవచ్చు.

3. How much loan can farmers get under KCC?

రైతుల అర్హత, పంట, సాగు విస్తీర్ణం, బ్యాంకు నిబంధనలను బట్టి రుణ పరిమితి నిర్ణయిస్తారు. 2026లో ప్రకటించిన MISS పరిమితి రూ.5 లక్షల వరకు ఉన్నప్పటికీ ప్రతి రైతుకు అంతే రుణం మంజూరు అవుతుందని కాదు.

TAGS : Kisan Credit Card, KCC Scheme, KCC Loan, KCC Apply Online, Farmer Loan Scheme, Agriculture Loan, KCC Eligibility, KCC Interest Rate, Farmers Government Schemes

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now

Leave a Comment