
Voter List Online 2026: మీ పేరు ఓటర్ లిస్టులో ఉందా లేదా వెంటనే చెక్ చేయండి
Voter List online 2026: మీరు ఓటు వేయడానికి అర్హులై ఉన్నప్పటికీ, ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ పేరు జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడానికి ఎన్నికల కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీ మొబైల్ ఫోన్ ద్వారా ఆన్లైన్ లో సులభంగా చెక్ చేసుకోవచ్చును. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ పేజీ లో తెలుసుకుందాం.
Overview of The Voter List Online 2026
| Topic | Online Voter List Verification |
| Responsible Authority | Election commission of India (ECI) |
| Required Information | EPIC number or Personal Details |
| Checking Method | Online |
| Information Available | Voter Details and Polling Station |
| Official Website | https://electoralsearch.eci.gov.in |
ఓటర్ల జాబితాలో పేరు ఉందో లేదో ముందుగానే తెలుసుకోవడం ప్రతి ఓటరుకు అవసరం. ముఖ్యంగా కొత్తగా ఓటరుగా నమోదు చేసుకున్నవారు, ఇటీవల నివాసం మార్చుకున్నవారు తమ వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలి. ఆన్‌లైన్‌లో తనిఖీ చేసే సమయంలో మీ పేరు, చిరునామా, ఇతర ఓటరు వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో కూడా గమనించండి. ఒకవేళ మీ పేరు కనిపించకపోతే, వెంటనే సంబంధిత ఎన్నికల అధికారులను సంప్రదించి మీ నమోదు స్థితి గురించి తెలుసుకోండి. ఇలా ముందుగానే వివరాలను ధృవీకరించుకోవడం వల్ల ఎన్నికల సమయంలో అనవసరమైన గందరగోళాన్ని నివారించవచ్చు.
How To Check Your Name In Voter List
ప్రజలు తమ ఓటింగ్ వివరాలను ఆన్లైన్ ద్వారా సులభంగా తనిఖీ చేయవచ్చును.
Step 1 : ముందుగా మీ మొబైల్ లో అధికారిక వెబ్ సైట్ అయిన https://electoralsearch.eci.gov.in ను ఓపెన్ చేయండి.

Step 2 : అక్కడ మీకు నచ్చిన భాషను ఎంచుకోండి.
Step 3 : మీ ఓటర్ ఐడి నెంబర్ ద్వారా శోధించాలనుకుంటే Search by EPIC ఆప్షన్ ను ఎంచుకోండి లేదా మీ యొక్క వ్యక్తిగత వివరాల ద్వారా శోధించాలనుకుంటే Search by Details ఆప్షన్ ను ఎంచుకోండి.
Step 4 : Search by EPIC ఆప్షన్ ను ఎంచుకున్న వారు ఓటర్ నెంబర్ ను ఎంటర్ చేయాలి, Search by Details ఆప్షన్ ను ఎంచుకున్న వారు మీ పేరు, బంధువు పేరు, పుట్టిన తేదీ, లింగం, రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం వంటి వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
Step 5 : వివరాలను నమోదు చేసిన తర్వాత Captcha ను కూడా ఎంటర్ చేయండి.
Step 6 : చివరగా Search బటన్ పై క్లిక్ చేయండి.
తద్వారా మీ పేరు పోలింగ్ స్టేషన్ వంటి వివరాలు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది.
ఎన్నికల సంఘం అందించే ఓటరు సేవలను అధికారిక ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా కూడా పరిశీలించవచ్చు. అలాగే ఓటరు సంబంధిత సందేహాల కోసం 1950 హెల్ప్ లైన్ ను సంప్రదించవచ్చు. కాల్ చేసే ముందు మీ ప్రాంతానికి వర్తించే సేవలు వివరాలను నిర్ధారించుకోండి.
How To Check Offline
ఆఫ్లైన్ ద్వారా జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలంటే మీ ప్రాంత బూత్ లెవెల్ ఆఫీసర్(BLO) లేదా సంబంధిత ఎన్నికల అధికారిని సంప్రదించండి.
జాబితాలో మీ పేరు కనిపించకపోతే ఏం చేయాలి?
ముందుగా మీరు నమోదు చేసిన పేరు, EPIC నెంబర్, రాష్ట్రం వంటి వివరాలను మరోసారి చూసుకోండి అయినప్పటికీ మీ సమాచారం కనిపించకపోతే, మీ ప్రాంతంలోని బూత్ లెవెల్ ఆఫీసర్ ను సంప్రదించండి.
🗳️ Voter List Online 2026
మీ పేరు ఓటర్ లిస్టులో ఉందో లేదో వెంటనే చెక్ చేసుకోండి. మీ Voter ID (EPIC) నంబర్ లేదా వ్యక్తిగత వివరాలతో సెర్చ్ చేయవచ్చు.
🔍 ఓటర్ లిస్టులో పేరు చెక్ చేయండి..
🔥 ముఖ్యమైన Voter ID లింకులు
🔥 డిజిటల్ ఓటు కార్డు డౌన్లోడ్ చేసుకోండి
📥 Download Digital Voter Card🔥 Voter ID Status Check Online 2026 – మీ ఓటర్ కార్డు ఉందో లేదో చెక్ చేయండి
🔍 Check Voter ID Status🔥 మీ ఊరు ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోండి
📋 Download Voter List🔥 కొత్త ఓటర్ కార్డు అప్లై చేయండి
📝 Apply for New Voter IDFAQS
ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి?
భారత ఎన్నికల సంఘం యొక్క అధికారిక వెబ్సైట్ ను సందర్శించే మీ EPIC నెంబర్ లేదా వ్యక్తిగత వివరాలతో మీ పేరును తనిఖీ చేయవచ్చు.
Voter ID కార్డు లేకుండా ఓటర్ల జాబితాలో పేరు చెక్ చేయవచ్చా?
అవును. వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్న వ్యక్తిగత వివరాల శోధన ఎంపికను ఉపయోగించి మీ పేరు, ఇతర అవసరమైన వివరాలతో తనిఖీ చేయవచ్చు.
Voter ID కార్డు ఉన్నా ఓటర్ల జాబితాలో పేరు లేకపోతే ఏం చేయాలి
మీ ప్రాంత బూత్ లెవల్ ఆఫీసర్(BLO) లేదా సంబంధిత ఎన్నికల అధికారిని సంప్రదించండి.
Voter id కి చెక్ చెయ్యడానికి ఏమి అవసరం అవుతాయి?
మీ EPIC నెంబర్ లేదా వెబ్ సైట్ లో అడిగే వ్యక్తిగత వివరాలు అవసరం అవుతాయి.
ఓటరు వివరాలకు సంబంధించిన సందేహాల కోసం ఎవరిని సంప్రదించాలి?
ఎన్నికల సంఘం హెల్ప్ లైన్ నెంబర్ 1950 ద్వారా లేదా మీ ప్రాంత BLOను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు.
Tags: Voter List 2026, Voter ID Check Online, Voter List Search, Check Name in Voter List, EPIC Number, Election Commission of India, Voter ID Online
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇
3 thoughts on “Voter List Online 2026: మీ పేరు ఓటర్ లిస్టులో ఉందా లేదా వెంటనే చెక్ చేయండి”