
🗳️ New Voter ID Apply Process 2026
2026లో కొత్త ఓటర్ ఐడీ కార్డ్‌కు అప్లై చేసే విధానం పూర్తిగా మారిపోయింది. ఇప్పటివరకు ఉన్న ఆఫ్‌లైన్ ప్రక్రియ కాకుండా, ఇప్పుడు Election Commission of India (ECI) అధికారిక పోర్టల్ ద్వారా పూర్తిగా ఆన్లైన్లోనే అప్లై చేసుకునే అవకాశం ఉంది.
ఈ కొత్త విధానంలో అప్లై చేసిన వెంటనే ఓటర్ ఐడీ PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే తర్వాత PVC ప్లాస్టిక్ ఓటర్ ఐడీ కార్డ్ పోస్టు ద్వారా ఇంటికే వస్తుంది. ఈ ఆర్టికల్‌లో 2026లో కొత్త ఓటర్ ఐడీ అప్లై చేసే పూర్తి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌ను సులభమైన తెలుగులో వివరించాం.
🔎 Overview – New Voter ID Apply 2026
| అంశం | వివరాలు |
|---|---|
| సేవ పేరు | New Voter ID Application |
| అధికారిక విభాగం | Election Commission of India |
| అప్లికేషన్ ఫారమ్ | Form No. 6 |
| అప్లికేషన్ విధానం | Online |
| అర్హత వయస్సు | 18 సంవత్సరాలు |
| డాక్యుమెంట్స్ | Aadhaar / DOB Proof / Address Proof |
| ఓటర్ ఐడీ రకం | e-EPIC + PVC Card |
| అధికారిక వెబ్సైట్ | voters.eci.gov.in |
🌐 Step 1: అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయడం
మొదట మీ మొబైల్ లేదా కంప్యూటర్లో ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేయండి.
Google లో “Voters ECI” అని సెర్చ్ చేయండి.
Election Commission of India అధికారిక వెబ్సైట్ కనిపిస్తుంది. అదే వెబ్సైట్ ద్వారా కొత్త ఓటర్ ఐడీ అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభించాలి.
📝 Step 2: Form No. 6 ఎంపిక చేయాలి
వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత Forms అనే సెక్షన్లోకి వెళ్లాలి.
కొత్త ఓటర్ ఐడీ కోసం Form No. 6 ను సెలెక్ట్ చేయాలి.
👉 మీ వయసు ఇప్పటికే 18 సంవత్సరాలు పూర్తయి ఉంటే లేదా త్వరలో 18 పూర్తవుతుంటే కూడా అప్లై చేయవచ్చు.
👉 ఇప్పటికే ఓటర్ ఐడీ ఉండి, SIR Enumeration Form నింపకపోవడం వల్ల పేరు తొలగితే – వాళ్లు కూడా Form 6 ద్వారానే మళ్లీ అప్లై చేయాలి.
🔥 పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు రిలీజ్ : Click Here
📱 Step 3: Sign Up & Login ప్రాసెస్
ఫారమ్ ఫిల్ చేయడానికి ముందుగా లాగిన్ అవ్వాలి.
కొత్త యూజర్లు ముందుగా Sign Up చేయాలి.
- మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి
- Captcha ఫిల్ చేయండి
- OTP ఎంటర్ చేసి Verify చేయండి
- Login పూర్తయిన తర్వాత మళ్లీ Form No. 6 ఓపెన్ చేయండి.
🗺️ Step 4: State, District & Assembly Constituency
ఇప్పుడు అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది.
ఇందులో మీ State, District, Assembly Constituency వివరాలు ఎంచుకోవాలి.
Assembly Constituency నెంబర్ తెలియకపోతే, Select AC ఆప్షన్లో మీ నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేయవచ్చు.
👤 Step 5: New Voter ఎంపిక
ఇక్కడ రెండు ఆప్షన్లు ఉంటాయి.
మీరు మొదటిసారి ఓటర్ ఐడీ అప్లై చేస్తున్నట్లయితే New Voter ఎంపిక చేయాలి.
ఆ తర్వాత Next క్లిక్ చేయాలి.
🧾 Step 6: పేరు & ఫోటో వివరాలు
మీ పేరు వివరాలను ఇంగ్లీష్‌లో మాత్రమే ఎంటర్ చేయాలి.
First Name, Middle Name, Surname అన్నీ జాగ్రత్తగా టైప్ చేయాలి.
ఫోటో అప్లోడ్ చేసే సమయంలో:
- Passport size ఫోటో ఉండాలి.
- Mask / Cap / Sunglasses ఉండకూడదు.
- ఫోటోను Crop & Rotate చేసి సేవ్ చేయాలి.
👨👩👦 Step 7: తండ్రి లేదా భర్త పేరు
Father లేదా Husband ఆప్షన్లో సరైనదాన్ని సెలెక్ట్ చేసి, వారి పేరు ఇంగ్లీష్‌లో ఎంటర్ చేయాలి.
Surname లేకపోతే ఖాళీగా వదిలేయవచ్చు.
📞 Step 8: Contact Details
మీ మొబైల్ నంబర్ మరియు Gmail ID ఇవ్వాలి.
భవిష్యత్తులో అన్ని అప్డేట్స్ ఇవే ద్వారా వస్తాయి.
🆔 Step 9: Aadhaar వివరాలు
ఆధార్ నంబర్ ఉంటే ఎంటర్ చేయాలి.
ఆధార్ లేని వారు “I am not able to furnish Aadhaar” ఆప్షన్ ఉపయోగించవచ్చు.
🎂 Step 10: Date of Birth & DOB Proof
Date of Birth వివరాలు ఎంటర్ చేసి, క్రింది డాక్యుమెంట్స్‌లో ఏదో ఒకదాన్ని అప్లోడ్ చేయాలి: Birth Certificate, Aadhaar, PAN Card, Driving License, 10th Marksheet లేదా Passport.
👉 ఫైల్ సైజ్ 2MB లోపు ఉండాలి.
👉 Aadhaar అయితే ముందు–వెనుక కలిపి ఒకే ఫైల్‌గా అప్లోడ్ చేయాలి.
🏠 Step 11: Address Details & Address Proof
ఇక్కడ ఇచ్చే అడ్రస్‌నే ఓటర్ ఐడీపై ప్రింట్ చేస్తారు.
అదే అడ్రస్‌కు PVC ఓటర్ ఐడీ కార్డ్ పోస్టు ద్వారా వస్తుంది.
Electricity Bill, Aadhaar, Bank Passbook, Passport వంటి అడ్రస్ ప్రూఫ్ అప్లోడ్ చేయవచ్చు.
📜 Step 12: SIR Declaration (చాలా ముఖ్యమైన స్టెప్)
ఇది తప్పనిసరి.
మీ తండ్రి లేదా తల్లి ఓటర్ వివరాలు, Assembly Constituency, Polling Booth వంటి వివరాలు ఇస్తే – మీ పేరు కుటుంబానికి దగ్గరగా మ్యాప్ అవుతుంది.
✍️ Step 13: Final Declaration & e-Sign
చివరగా Captcha ఫిల్ చేసి OTP ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
ఆధార్ OTP ద్వారా e-Sign పూర్తిచేస్తే అప్లికేషన్ ఫైనల్ అవుతుంది.
✅ Application Submit అయిన తర్వాత
- Application Reference Number జనరేట్ అవుతుంది.
- Acknowledgement Slip డౌన్లోడ్ చేసుకోవాలి.
- అదే నంబర్‌తో Status Track చేయవచ్చు.
Approved అయిన తర్వాత:
- ఓటర్ ఐడీ PDF డౌన్లోడ్ చేయవచ్చు
- PVC ఓటర్ ఐడీ కార్డ్ పోస్టు ద్వారా ఇంటికే వస్తుంది.
✅ Important Link’s
ఓటర్ కార్డుకు సంబంధించి ముఖ్యమైన లింక్స్ అన్ని క్రింద టేబుల్ లో ఉన్నాయి చెక్ చేయండి.
| 🔥 Voter Card Apply Link | Click Here |
| 🔥 ఓటర్ లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో చెక్ | Click Here |
| 🔥 New Voter Card Download Link | Click Here |
| 🔥 Home Page Jobs+Schemes+Updates | Click Here |
ఇవి కూడా చదవండి 👇
- NTR Bharosa Pension Status Check 2026: మీ Pension Application Onlineలో Pending or Aprove ఇలా Check చేయండి
- AP ASHA Worker Jobs 2026: కొత్త Recruitment విడుదల – మహిళలకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశం, Apply Details
- Aadhaar Update History Download 2026: ఆధార్‌లో ఎప్పుడు ఏ మార్పు చేశారో ఇలా చెక్ చేయండి
- Bank Account KYC Update Online 2026: ఇంటి నుంచే KYC Update చేసుకునే Complete Process
- Ayushman Bharat Card: వాట్సాప్‌లో ‘Hi’ పంపితే 5 లక్షల ఆయుష్మాన్ భారత్ కార్డ్
❓ FAQs – New Voter ID Apply 2026
కొత్త ఓటర్ ఐడీ అప్లికేషన్‌కు వయస్సు ఎంత ఉండాలి?
18 సంవత్సరాలు పూర్తైన ప్రతి భారతీయ పౌరుడు అప్లై చేయవచ్చు.
Form No. 6 ఎవరు ఉపయోగించాలి?
కొత్త ఓటర్ ఐడీ అప్లై చేయాలనుకునే వారు లేదా పేరు తొలగిన వారు Form 6 ఉపయోగించాలి.
PVC ఓటర్ ఐడీ కార్డ్ ఎలా వస్తుంది?
అప్లికేషన్ అప్రూవ్ అయిన తర్వాత పోస్టు ద్వారా ఇంటికే వస్తుంది.
ఆధార్ లేకుండా అప్లై చేయవచ్చా?
అవును, ఆధార్ లేకపోయినా అప్లై చేసే అవకాశం ఉంది.
Tags : new voter id apply 2026, voter id online apply telugu, form 6 voter id, voters eci new voter registration, pvc voter id card apply, election commission voter id, new voter id process telugu, epic voter id download
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇