
AP SADAREM Slot Booking 2026: ఇక నుంచి ఇంట్లో నుండే సదరం స్లాట్ బుక్ చేసుకోండి ఇలా!
AP SADAREM Slot Booking 2026: సచివాలయానికి వెళ్ళకుండానే స్లాట్ బుక్ చేసుకునే అవకాశం.. ఏపీ సేవ వాట్సాప్ ద్వారా పూర్తి వివరాలు. సదరం స్లాట్ బుకింగ్ లో కొత్త మార్పులు ఏంటి.. సదరం సర్టిఫికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి.. వంటి పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.
Overview Of AP SADAREM Slot Booking 2026
ఆంధ్రప్రదేశ్ లో సదరం స్లాట్ బుకింగ్ సేవల్లో ప్రభుత్వం కొత్త మార్పులు తీసుకువచ్చింది. ఇప్పటివరకు సదరం స్లాట్ బుకింగ్ కోసం సచివాలయాలపై ఆధారపడాల్సి ఉండగా, ప్రస్తుతం ప్రజలు మరింత సులభంగా సేవలను పొందేలా APSeva-Citizen Login ద్వారా స్వయంగా స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా, SADAREM Assessment పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కూడా కల్పించారు. మరోవైపు WhatsApp-eGovernance సర్వీసెస్ ద్వారా కూడా సదరం స్లాట్ అవైలబిలిటీ, స్లాట్ బుకింగ్, సర్టిఫికెట్ డౌన్లోడ్ వంటి సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు.
| Service Name | SADAREM Services |
| State | Andhra Pradesh |
| Booking Method | Online |
| Platforms | AP Seva Citizen Services / WhatsApp e-Governance |
New Changes in SADAREM Slot Booking
ఏపీ సదరం స్లాట్ బుకింగ్ లో చేసిన కొన్ని కొత్త మార్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
- సదరం స్లాట్ బుకింగ్ కోసం తప్పనిసరిగా సచివాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా, APSeva-Citizen Login ద్వారా అలాగే వాట్స్అప్ గవర్నెన్స్ ద్వారా స్వయంగా స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు.
- మీకు అందుబాటులో ఉన్న స్లాట్లను చూసుకొని, మీకు అనుకూలమైన స్లాట్ ను ఎంచుకొని బుక్ చేసుకునే విధానం అందుబాటులోకి వచ్చింది.
- అదేవిధంగా Assessment పూర్తయిన తర్వాత సదరం సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కూడా కల్పించారు.
ప్రయోజనాలు
ఈ కొత్త విధానం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
- సచివాలయానికి వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది.
- ఇంటి నుంచే స్లాట్ Availability తెలుసుకోవచ్చు.
- అందుబాటులో ఉన్న స్లాట్ ను స్వయంగా బుక్ చేసుకోవచ్చు.
- Assessment తర్వాత సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- వాట్సాప్ ద్వారా కూడా సదరం సర్వీసెస్ పొందే అవకాశం ఉంది.
నేటి నుంచి సదరం స్లాట్ బుకింగ్
ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగుల ధృవీకరణ పత్రాల కోసం సదరం స్లాట్ బుకింగ్ (SADAREM Slot Booking) నవంబర్ 2, 2026 నుంచి ప్రారంభమైంది.
- సచివాలయాలు, దివ్యాంగులు సదరం ధ్రువపత్రాలు పొందేందుకు ముందస్తు స్లాట్ నమోదుకు నేటి నుంచి ప్రభుత్వం అవకాశం కల్పించింది.
- గ్రామ, వార్డు కార్యాలయాలు, ‘మన మిత్ర’’ వాట్సాప్, ఏపీ సేవా సిటిజన్ పోర్టల్ ద్వారా సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ముఖ్యమైన వివరాలు :
- స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఆరు నెలల లోపు వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలి.
- మొత్తం 75 వేల సదరం స్లాట్లను ప్రభుత్వం విడుదల చేసింది.
- దరఖాస్తుకు ఆధార్ కార్డు, రేషన్/రైస్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు మరియు పాత వైద్య నివేదికలు (అవసరమైతే) సిద్ధంగా ఉంచుకోవాలి.
How To Book Sadarem Slot Booking Process
Step 1 : ముందుగా మీ మొబైల్ లో “APSeva Citizen Login” ను ఓపెన్ చేయండి.
Step 2 : APSeva Citizen Services లోని Citizen Login ను ఓపెన్ చేయండి.
Step 3 : మీకు అందించిన అధికారిక లాగిన్ వివరాలు తో సిటిజెన్ లాగిన్ లోకి ప్రవేశించండి.
Step 4 : హోం పేజీలో ఉన్న “SADAREM Service” ను ఎంపిక చేయండి.
Step 5 : “SADAREM Slot Booking” ఆప్షన్ లో మీకు అందుబాటులో ఉన్న స్లాట్స్ ను పరిశీలించి, మీకు అనుకూలంగా ఉన్న Available Slot ను ఎంచుకోండి.
Step 6 : ఆ తరువాత అవసరమైన వివరాలను ఎంటర్ చేసి, బుకింగ్ ప్రక్రియను పూర్తి చేయండి.
WhatsApp E – Governance Sadarem Slot Booking Process (మన మిత్ర వాట్సాప్ ద్వార)
ఇక నుంచి మనం ఇంట్లో నుండే వాట్సప్ ఈ గవర్నెన్స్ ద్వారా అనగా వాట్సాప్ మిత్ర ద్వారా సదరం సర్టిఫికెట్ బుక్ చేసుకోవచ్చు అని మరో స్టేటస్ చెక్ చేయవచ్చును అన్ని రకాల సర్వీస్ లు ఉపయోగించవచ్చును.
- ఫస్ట్ అఫ్ ఆల్ మీ మొబైల్ లో వాట్సప్ గవర్నమెంట్ కు సంబంధించిన మొబైల్ నెంబర్ సేవ్ చేసుకొని హాయ్ అని మెసేజ్ పంపండి.
- తర్వాత మీకు కింద ఇమేజ్ లో చూపించిన విధంగా అన్ని రకాల సర్వీసులు రావడం జరుగుతుంది.
- అందులో మీరు సదరం అనే సర్వీస్ పై క్లిక్ చేయండి. ఈ క్రింద ఉన్న ఇమేజ్ ని చూసి ఒకసారి కన్ఫామ్ చేసుకోగలరు.

- పైన ఇమేజ్లో చూపించిన ప్రకారం మీ వాట్సాప్ లో ఓపెన్ అవడం జరుగుతుంది.
- అక్కడ మీకు సంబంధించిన సర్వీస్ నీ సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన ప్రాసెస్ కంప్లీట్ చేయొచ్చు.
- 21 కేటగిరీల్లో వైకల్యాలకు వేర్వేరుగా స్లాట్లు కేటాయించనున్నారు.
- యాసిడ్ దాడి, అభ్యాస వైకల్యం, ఆటిజం, బహుళ వైకల్యం వంటి కొత్త కేటగిరీలకు వేర్వేరుగా స్లాట్లు నమోదు చేసుకోవాలి.
- స్లాట్ నమోదుకు వెళ్లేవారు ఆధార్ కార్డుతో పాటు దానికి అనుసంధానమైన ఫోన్ నంబర్ కూడా వెంట తీసుకెళ్లాలి.
గమనిక : మీరు సచివాలయం కి వెళ్లి కూడా సదరం సర్టిఫికెట్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు కాబట్టి మీకు ఎలా వీలైతే ఆ ప్రాసెస్ ద్వారా కంప్లీట్ చేయండి.
📲 Mana Mitra WhatsApp Services
వాట్సాప్ గవర్నమెంట్ ద్వారా SADAREM Slot Booking వివరాలు తెలుసుకోవడానికి కింద ఉన్న బటన్‌పై క్లిక్ చేయండి.
WhatsApp Number: 9552300009 💬 Open Mana Mitra WhatsAppClick the button above to open Mana Mitra WhatsApp.
How To Download SADAREM Certificate
SADAREM Assessment పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కూడా అందుబాటులోకి వచ్చింది.
Step 1 : ముందుగా మీ మొబైల్ లో APSeva Citizen Login ను ఓపెన్ చేయండి.
Step 2 : SADAREM కు సంబంధించిన Services లోకి వెళ్ళి, “Certificate Download” ఆప్షన్ ను ఎంచుకోండి.
Step 3 : అవసరమైన సదరం వివరాలను ఎంటర్ చేసి సంబంధిత సర్టిఫికెట్ ను వెతకండి.
Step 4 : సర్టిఫికెట్ అందుబాటులో ఉండే డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
👇👇👇👇👇
📥 Download SADAREM Certificate..
WhatsApp-eGovernance Services
వాట్సాప్ ద్వారా కూడా సదరం సర్వీసెస్ ను పొందవచ్చు. దీని ద్వారా మొబైల్ ఫోన్ నుంచే కొన్ని సదరం సేవలను పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇందులో అందుబాటులో ఉండే ప్రధాన సేవలు ఏవో ఇప్పుడు చూద్దాం.
- SADAREM Slot Availability
- SADAREM Slot Booking
- SADAREM Certificate Download.
వాట్సాప్ ద్వారా Slot Availability ఎలా తెలుసుకోవాలి, సదరం స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి, సవరం సర్టిఫికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, వంటి వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
వాట్సాప్ ద్వారా సదరం Slot Availability ఎలా తెలుసుకోవాలి?
ముందుగా వాట్సాప్ ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ లో సదరం సర్వీసెస్ ను ఎంచుకొని అందుబాటులో ఉన్న స్లాట్ వివరాలను తెలుసుకోవాలి. అందులో మీకు అనుకూలమైన స్లాట్ అందుబాటులో ఉంటే దాన్ని ఎంపిక చేసుకుని, తద్వారా మీకు అందుబాటులో ఉన్న స్లాట్స్ ను తెలుసుకోవచ్చు.
వాట్సాప్ ద్వారా సదరం స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి?
వాట్సాప్ ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ ను ఓపెన్ చేయండి. అక్కడ సదరం సర్వీసెస్ ను ఎంపిక చేయండి. Slot Availability ను పరిశీలించండి. అందుబాటులో ఉన్న స్లాట్ ను ఎంపిక చేయండి, అవసరమైన వివరాలను ఎంటర్ చేసి బుకింగ్ పూర్తి చేయండి.
సదరం సర్టిఫికెట్ ఎలా డౌన్లోడ్ చేయాలి?
SADAREM Assessment పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకుంటే సదుపాయం కూడా కొత్త విధానంలో అందుబాటులోకి వచ్చింది. అంటే సర్టిఫికెట్ కోసం ప్రతి సందర్భంలోనూ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా అందుబాటులో ఉన్న అధికారిక ఆన్లైన్ లేదా వాట్సప్ సర్వీస్ ద్వారా సర్టిఫికెట్లు పొందే అవకాశం ఉంటుంది.
📄 సదరం స్లాట్ బుకింగ్ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి
📥 Download Application Form.
🔥 ముఖ్యమైన Voter ID లింకులు
📱 Voter Card Download App – మొబైల్ యాప్ ద్వారా
📲 Download Voter App🌐 Voter Card Download Website – అధికారిక పోర్టల్
🪪 Open Voter Services Portal🔍 Voter List Online 2026 – మీ పేరు ఓటర్ లిస్టులో ఉందో లేదో చెక్ చేయండి
📋 Check Voter ListFAQS Of The Post
SADAREM Slot Booking కోసం సచివాలయానికి వెళ్లాలా?
ప్రస్తుతం APSeva Citizen Login ద్వారా SADAREM Slot Availability చూసుకుని స్లాట్ బుకింగ్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది
సదరం సర్టిఫికెట్ ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చా?
అవును. Assessment పూర్తయిన తర్వాత సదరం సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకుని సదుపాయం అందుబాటులోకి వచ్చింది
WhatsApp ద్వారా SADAREM Slot Availability తెలుసుకోవచ్చా?
అవును.WhatsApp e-Governance Services లో SADAREM Slot Availability సర్వీస్ అందుబాటులో ఉంది.
TAGS : AP SADAREM Slot Booking 2026, SADAREM Online Booking, AP SADAREM, SADAREM Certificate, SADAREM Slot Booking Online, AP Government Services, SADAREM Registration
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇
4 thoughts on “AP SADAREM Slot Booking 2026: ఇక నుంచి ఇంట్లో నుండే సదరం స్లాట్ బుక్ చేసుకోండి ఇలా!”