Ration Card e-KYC 2026: రేషన్ షాప్‌కు వెళ్లకుండానే మొబైల్‌తో eKYC ఎలా పూర్తి చేయాలి?

Ration Card e-KYC 2026

Ration Card e-KYC 2026: రేషన్ షాప్‌కు వెళ్లకుండానే మొబైల్‌తో eKYC ఎలా పూర్తి చేయాలి?

రేషన్ కార్డు లబ్ధిదారులకు e-KYC అనేది చాలా ముఖ్యమైన ధ్రువీకరణ ప్రక్రియ. e-KYC అనగా Electronic Know Your Customer. దీని ద్వారా రేషన్ కార్డులు నమోదైన వ్యక్తి నిజమైన లబ్ధిదారుడేనా మరియు అతని వివరాలు సరైనవేనా వంటి విషయాలను అధికారులు సులభంగా నిర్ధారించగలరు. అయితే ఇప్పుడు ఈ-కేవైసీ ప్రక్రియను మీ మొబైల్ ద్వారా ఇంటి వద్ద ఉండే సులభంగా పూర్తి చేయవచ్చును. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు.. ఈ-కేవైసీ ప్రక్రియను ఎలా పూర్తి చేయాలి.. వంటి వివరాలను ఈ పేజీలో తెలుసుకుందాం.

WhatsApp Group Join Now

మరి ముఖ్యంగా మీ రేషన్ కార్డుకి ఈ కేవైసీ అయిందో లేదో చెక్ చేసుకోండి. కాకపోతే మీకు రేషన్ కార్డు ఇన్ యాక్టివ్ అవడం జరుగుతుంది. మోర్ అప్డేట్స్ కోసం మా వాట్సాప్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.

Overview Of Ration Card e-KYC 2026

రేషన్ కార్డులో నమోదైన వ్యక్తి వివరాలు మరియు తమ యొక్క ఆధార్ లో ఉన్న వివరాలతో సరిపోతున్నాయా లేదా అని నిర్ధారించడానికి అధికారులకు ఈ-కేవైసీ చాలా ఉపయోగపడుతుంది. అందువలన కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే ప్రజలు సులభంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం మొబైల్ ద్వారానే తమ యొక్క ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవడానికి మేరా ఈకేవైసీ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం మీ దగ్గర మొబైల్ ఉండి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు చాలా సులభంగా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చును.

Name of the Service Ration Card e-KYC
VerificationAadhaar Based Authentication
MethodFace Authentication/OTP
RequirementAadhaar linked mobile Number
ApplicationMera eKYC

Uses Of Ration Card e-KYC

రేషన్ కార్డు ఈ-కేవైసీ వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం మన దేశంలో రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి లబ్ధిదారులు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే దీని వలన కలిగే ప్రధాన ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • రేషన్ కార్డులో ఉన్న వ్యక్తి నిజమైన లబ్ధిదారుడేనా కాదా అని సులభంగా గుర్తించవచ్చును.
  • డూప్లికేట్ రేషన్ కార్డులను అధికారులు సులభంగా గుర్తించవచ్చు.
  • అర్హులైన వారికి ప్రభుత్వ రేషన్ సక్రమంగా అందించవచ్చు.
  • లబ్ధిదారుడి గుర్తింపును ఆధార్ ఆధారంగా ధ్రువీకరించవచ్చు.
  • డిజిటల్ సేవలను మెరుగుపరవచ్చు.
  • ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేయవచ్చు.

Requirements

ఆన్లైన్ ప్రక్రియ ద్వారా ఈ కేవైసీ పూర్తి చేయాలంటే తప్పనిసరిగా ఈ క్రింద తెలిపినవి ఉండాలి.

  • మొబైల్ ఫోన్
  • ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్
  • ఇంటర్నెట్

How To Complete e-KYC in Online

Step 1 : ముందుగా మీ మొబైల్ లో మేరా ఈ-కేవైసీ మరియు ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్స్ ను ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి.

Step 2 : ఇప్పుడు మేరా ఈ-కేవైసీ యాప్ ను ఓపెన్ చేయండి.

Step 3 : అక్కడ మీ యక్క ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసి, Get OTP పై క్లిక్ చేయండి.

Step 4 : మీ యొక్క ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీ ను ఎంటర్ చేయండి.

Step 5 : ఆ తర్వాత CAPTCHA ను కూడా ఎంటర్ చేసి, Submit బటన్ పై క్లిక్ చేయండి.

Step 6 : అక్కడ మీ యొక్క Name, Aadhaar Number, Ration Card Number, District, State, e-KYC Status డిస్ప్లే అవ్వడం జరుగుతుంది.

Step 7 : ఇప్పుడు Face eKYC ఆప్షన్ పై క్లిక్ చేయండి. మీ మొబైల్ కెమెరా ఆన్ అవ్వడం జరుగుతుంది.

Step 8 : మీ ఫేస్ Authentication పూర్తి చేయండి. తద్వారా ఈ-కేవైసీ పూర్తి అయినట్లు మెసేజ్ వస్తుంది.

a

🪪 Ration Card e-KYC App 2026

రేషన్ కార్డు e-KYC కోసం అవసరమైన అధికారిక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి క్రింది బటన్‌పై క్లిక్ చేయండి.

📲 App Download Now

.

📱 Aadhaar Face RD App

Aadhaar Face Authentication కోసం అవసరమైన Aadhaar Face RD Appను డౌన్‌లోడ్ చేసుకోవడానికి క్రింది బటన్‌పై క్లిక్ చేయండి.

📲 Aadhaar Face RD App Download

రేషన్ కార్డ్ Ekyc ప్రాసెస్ & స్టేటస్ డెమో వీడియో

మీకు రేషన్ కార్డుకి Ekyc చేయు పూర్తి విధానం మరియు స్టేటస్ చెక్ చేయు విధానం కింద ఉన్న డెమో వీడియో చూసి మీరు కూడా మీ రేషన్ కార్డు డీటెయిల్స్ చెక్ చేసుకోండి..

🎥 Demo Video : Click Here

📌 ముఖ్యమైన లింక్స్🔗 క్లిక్ చేయండి
📱 Aadhaar Mobile Number Update Online 2026 Update Details
📸 Aadhaar Photo Update Online 2026 View Details

FAQS Ration Card e-KYC 2026

రేషన్ కార్డు ఈ-కేవైసీ అంటే ఏమిటి?

రేషన్ కార్డులో నమోదైన లబ్ధిదారుడు గుర్తింపును ఆధార ఆధారంగా ఎలక్ట్రానిక్ విధానంలో ధ్రువీకరించే ప్రక్రియను ఈ-కేవైసీ అంటారు.

మొబైల్ ద్వారా ఈ-కేవైసీ చేయవచ్చా?

అవును. మేరా eKYC యాప్ ద్వారా సులభంగా మొబైల్ లోనే ఈ-కేవైసీ పూర్తి చేయవచ్చును.

ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలా?

అవును. ఈ ప్రక్రియను మొబైల్ ద్వారా చేసే సమయంలో ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది. కాబట్టి వెరిఫికేషన్ సమయంలో తప్పనిసరిగా ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ ఉండాలి.

TAGS : Ration Card eKYC 2026, Ration Card eKYC Online, Ration Card eKYC Telangana, Mera eKYC App, Aadhaar Face RD, Telangana Ration Card, Ration Card eKYC Status

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now

1 thought on “Ration Card e-KYC 2026: రేషన్ షాప్‌కు వెళ్లకుండానే మొబైల్‌తో eKYC ఎలా పూర్తి చేయాలి?”

Leave a Comment

?>