AP NTR Bharosa Pension DBT Update 2026: పెన్షన్ కొత్త Rules ఏంటి? Bankలో ఎంత పడుతుంది, చేతికి ఎంత ఇస్తారు?

AP NTR Bharosa Pension DBT Update 2026

AP NTR Bharosa Pension DBT Update 2026: పెన్షన్ కొత్త Rules ఏంటి? Bankలో ఎంత పడుతుంది, చేతికి ఎంత ఇస్తారు?

AP NTR Bharosa Pension DBT Update 2026 : కేంద్ర ప్రభుత్వం తాజా ఆదేశాల ప్రకారం NSAP ( National Social Assistance Program ) ద్వారా కేంద్ర ప్రభుత్వ వాటాను DBT ఆప్షన్ ద్వారా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. మిగతా అమౌంట్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు నేరుగా పాత పద్ధతిలో అమలు చేస్తుంది.

WhatsApp Group Join Now

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరి గ్రామీణ అభివృద్ధి శాఖకు సంబంధించి MEMO No. 3336974/RD.1/A1/2026 ను సంబంధించి 22వ తేదీ సెప్టెంబర్ 2026 కొత్త జీవో జారీ చేసినట్టు తాజాగా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. పూర్తి వివరాలు చూద్దాం మోర్ అప్డేట్స్ కోసం మా వాట్సాప్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.

Overview of The AP NTR Bharosa Pension DBT Update 2026

22 సెప్టెంబర్ 2026 నాటి ప్రభుత్వ మెమో ప్రకారం, IGNOAPS, IGNWPS, IGNDPS కింద కేంద్ర ప్రభుత్వ NSAP వాటా మాత్రమే DBT ద్వారా బ్యాంక్ ఖాతాలో జమ చేయడానికి అనుమతి ఇచ్చారు. మిగిలిన రాష్ట్ర వాటా NTR Bharosa ద్వారా నగదుగా అందించే విధానం కొనసాగుతుంది.

DetailsInformation
SchemeNTR Bharosa Pension
UpdateDBT Payment System 2026
StateAndhra Pradesh
Bank PaymentNSAP కేంద్ర వాటా DBT ద్వారా
Cash Paymentరాష్ట్ర ప్రభుత్వ వాటా ఇంటి వద్ద నగదు
Payment AmountCategory ప్రకారం ₹4,000 / ₹6,000 తదితరాలు
Latest Update22 September 2026 Memo

పెన్షన్ డబ్బులు ఇంకా ఎలా అందుతాయి?

కొత్తగా వచ్చిన విధానం ప్రకారం పింఛన్ మొత్తాన్ని రెండు భాగాలుగా విభజించారు.

  • కేంద్ర ప్రభుత్వ వాటా
  • రాష్ట్ర ప్రభుత్వ వాటా

కేంద్ర ప్రభుత్వ పెన్షన్ వాటా

NSAP ( National Social Assistance Program ) కింద ప్రభుత్వం అందించే వాటాను DBT ( direct benefit transfer ) విధానంలో నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయనట్లు తాజాగా సమాచారం రావడం జరిగింది. తప్పనిసరిగా లబ్ధిదారుడు బ్యాంక్ అకౌంట్ కి NPCI LINK అనేది కలిగి ఉండాలి.

రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ వాటా

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ప్రభుత్వ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించే మిగిలిన మొత్తాన్ని పింఛన్ పంపిణీ విధానం ద్వారా లబ్ధిదారులకు అందించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

ప్రస్తుతం వచ్చే పెన్షన్ మొత్తంలో కొంత మొత్తం బ్యాంకు ఖాతా లో జమ కాగా మిగిలిన మొత్తం నగదు రూపంలో లబ్ధిదారులకు నేరుగా అందించడం జరుగుతుంది.

ఏ పింఛన్లకు ఈ విధానం వర్తిస్తుంది?

ఇప్పటివరకు వచ్చిన తాజా సమాచారం ప్రకారం ఈ మార్పు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ NSAP పరిధిలోని పెన్షన్లకు సంబంధించినది.

  • IGNOAPS – ఇందిరా గాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్
  • IGNWPS – ఇందిరాగాంధీ జాతీయ వితంతు పెన్షన్
  • IGNDPS – ఇందిరాగాంధీ జాతీయ దివ్యాంగుల పెన్షన్

ప్రస్తుతము వచ్చిన తాజా ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9.35 లక్షల NSAP ఈ సంబంధించి లబ్ధిదారులకు కేంద్ర వాటా ద్వారా DBT విధానంలో జమ ఏ విధంగా వర్తించవచ్చని పేర్కొంది.

Bankలో ఎంత? చేతికి ఎంత?

తాజాగా వచ్చిన ఆదేశాల ప్రకారం పింఛన్ కేటగిరీని బట్టి కేంద్ర ప్రభుత్వ వాటా ఈ క్రింది విధంగా ఉంది ఇమేజ్ ని చూడవచ్చు.

Ap ntr barosa pension dbt update 2026
Pension CategoryBank DBTచేతికి CashTotal
IGNOAPS 60–79₹200₹3,800₹4,000
IGNOAPS 80+₹500₹3,500₹4,000
IGNWPS 40–79₹300₹3,700₹4,000
IGNWPS 80+₹500₹3,500₹4,000
IGNDPS 18–79₹300₹5,700₹6,000
IGNDPS 80+₹500₹5,500₹6,000

ఉదాహరణకు : రూ. 4000 వృద్ధాప్య పెన్షన్ పొందే 60-70 సంవత్సరాల లబ్ధిదారునికి రూ. 200 బ్యాంకు ఖాతాలో DBT ద్వారా జమ కాగా, మిగిలిన రూ. 3,800 నగదు రూపంలో అందే విధంగా ఉంటుందని సమాచారం.

అదేవిధంగా 6000 రూపాయలు పొందే దివ్యాంగుల పెన్షన్ లబ్ధిదారునికి రూ. 300 బ్యాంకు ఖాతాలో జమ కాగా, మిగిలిన రూ. 5,700 నగదు రూపంలో అందుతుంది.

ఇక్కడే మీరందరూ తెలుసుకోవలసిన పాయింట్ ఒకటి ఉంది.. DBT అంటే ఏంటో చూద్దాం.

DBT ( DIRECT BENEFIT TRANSFER ) ?

ప్రతి వ్యక్తికి ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా డబ్బు తన యొక్క బ్యాంకు ఖాతాలో జమ కావాలంటే తప్పనిసరిగా DBT కలిగి ఉండాలి. లేకపోతే లబ్ధిదారుని ఖాతాలో ఎటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి డబ్బులు జమ కాదు.

DBT అనగా డైరెక్ట్ గా లబ్ధిదారుని ఖాతాలో NPCI LINK ద్వారా ( అనగా ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింకింగ్ ద్వారా ) ప్రతి రూపాయి లబ్ధిదారులు బ్యాంకు ఖాతాలో జమవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయి ఉండాలి. లేకపోతే మీకీ సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులు రావు.

NPCI ( ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి ) ? : ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మీ ఇంటి నుంచి మీ మొబైల్ లోనే మీ ఆధార్ కార్డు క ఏ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయిందని తెలుసుకోవచ్చును. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు క్రింద ఇచ్చిన లింకును క్లిక్ చేసుకొని మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయింది చెక్ చేయండి.

🏦 NPCI – ఆధార్ బ్యాంక్ అకౌంట్ స్టేటస్

మీ ఆధార్‌కు ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో తెలుసుకోవడానికి క్రింది బటన్‌పై క్లిక్ చేయండి.

🔍 NPCI Bank Account Status Check

కొత్త పెన్షన్ కి సంబంధించి న్యూ రూల్స్ G.O డౌన్లోడ్ చేసుకోండి

మరింత సమాచారం కోసం కింద ఉన్న జీవో ని ఒకసారి చెక్ చేయండి. అలాగే మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఒక డెమో వీడియో కూడా చేశాను చెక్ చేయండి.

🎥 Demo Video :- Click Here

📄 కొత్త పెన్షన్ రూల్స్ G.O

కొత్త పెన్షన్ రూల్స్ G.O PDFను డౌన్‌లోడ్ చేసుకోవడానికి క్రింది బటన్‌పై క్లిక్ చేయండి.

📥 కొత్త పెన్షన్ G.O Download

FAQS Of The NTR Bharosa Pension

1. NTR Bharosa Pension మొత్తం Bank Accountలో పడుతుందా?

లేదండి కేంద్ర ప్రభుత్వ వాటా మాత్రమే బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. మిగతా అమౌంట్ నేరుగా లబ్ధిదారులకు ఇంటి దగ్గరికి వచ్చి ఇస్తారు.

2. మిగిలిన Pension డబ్బులు ఎలా ఇస్తారు?

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ప్రభుత్వ పథకం ద్వారా మిగతా అమౌంట్ ను నగదు రూపంలో లబ్ధిదారులకు ఇస్తారు.

3. వృద్ధాప్య Pensionలో Bankలో ఎంత పడుతుంది?

60–79 వయస్సు IGNOAPSలో ₹200 DBT, ₹3,800 నగదు — మొత్తం ₹4,000. 80+లో ₹500 DBT, ₹3,500 నగదు.

4. ఈ DBT విధానం ఎప్పటి నుంచి?

ఈ విధానం తాజాగా వచ్చిన ఆదేశాల ప్రకారం చూసినట్టయితే త్వరలోనే మనకు అమలు కాబోతుంది.

TAGS : NTR Bharosa Pension 2026, NTR Bharosa Pension DBT, AP Pension DBT Update, NTR Bharosa New Rules 2026, AP Pension Payment 2026, NTR Bharosa Pension Amount, AP Government Schemes 2026, Pension Bank Account Payment

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now

Leave a Comment

?>