
Aadhaar Card WhatsApp Download 2026: వాట్సాప్ లోనే ఆధార్ కార్డు ఫ్రీగా PDF డౌన్లోడ్ చేసుకోండి.
ఆధార్ కార్డ్ భారతదేశంలో అత్యంత ముఖ్యమైన గుర్తింపు పత్రాల్లో ఒకటి. మనం బయటకు వెళ్ళిన ప్రతి సారి ఫిజికల్ ఆధార్ కార్డ్ ను తీసుకువెళకపోవచ్చు. అటువంటి సమయంలో Digilocker ఉపయోగించి ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయవచ్చు. అయితే ఇప్పుడు కేవలం రెండు నిమిషాలలో మీరు మీ ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చును అది కూడా వాట్సాప్ ద్వారా సులభంగా. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు.. ఎలా డౌన్లోడ్ చేయాలి.. వంటి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం.
Overview Of Aadhaar Card Whatsapp Download 2026
బ్యాంకింగ్, ప్రభుత్వ సేవలు, విద్యా, ప్రయాణం, సిమ్ కార్డు వంటి అనేక సందర్భాల్లో ఆధార్ కార్డు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే చాలా సందర్భాలలో ఫిజికల్ ఆధార్ కార్డు మన దగ్గర ఉండకపోవచ్చు. అటువంటి సమయంలో Digilocker ప్లాట్ఫారం సేవల ద్వారా ఆధార్ కార్డును వాట్సాప్ లోనే డౌన్లోడ్ చేయవచ్చును. Digilocker అనేది భారత ప్రభుత్వ MEIT(Ministry of Electronics & Information Technology) ఆధ్వర్యంలోని డిజిటల్ డాక్యుమెంట్ ప్లాట్ఫామ్. ఇందులో ప్రభుత్వ సంస్థలు జారీ చేసిన డిజిటల్ డాక్యుమెంట్లను యాక్సిస్, షేర్ మరియు వెరిఫై చేయవచ్చు.
| Name Of the Service | Digital Aadhaar/e-Aadhaar |
| Platform | Digilocker |
| Requirement | Digilocker Account |
| Mobile | Aadhaar Linked Mobile Number |
Requirements
ఈ విధానాన్ని ఉపయోగించి ఆధార్ కార్డు ను వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏమేమి కావాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
- మీకు Digilocker Account ఉండాలి.
- ఆధార్ కార్డ్ కు తప్పనిసరిగా మీ మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి.
- మీ మొబైల్ లో వాట్సాప్ ఉండాలి.
- MyGov Helpdesk WhatsApp Number: +91-9013151515
ఒకవేళ మీకు ఇంకా Digilocker అకౌంట్ లేకపోతే ముందుగా మీరు Digilocker Account క్రియేట్ చేసుకోవాలి.
Be Aware While Downloading Aadhaar Card
మీరు మీ మొబైల్ లో ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసే సమయంలో మరియు డౌన్లోడ్ చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
- ఆధార్ కార్డ్ అనేది ఒక గుర్తింపు కార్డు కాబట్టి మీ ఆధార్ వివరాలను జాగ్రత్తగా ఉంచండి.
- కేవలం ప్రభుత్వ అందించిన MyGov Helpdesk WhatsApp Number ను మాత్రమే ఉపయోగించాలి.
- వాట్సాప్ లో వచ్చే తెలియని లింక్స్ పై క్లిక్ చేయకూడదు.
- ఓటిపి ను ఇతరులతో షేర్ చేసుకోకూడదు.
- ఆధార్ నెంబర్ ను అనవసరమైన వెబ్ సైట్ లో లేదా తెలియని వ్యక్తులతో షేర్ చేసుకోవద్దు.
How To Download Aadhaar Card Whatsapp Download 2026
Step 1 : ముందుగా మీ మొబైల్ లో MyGov Helpdesk Number అయిన +91-9013151515 ను సేవ్ చేసుకోండి.
Step 2 : వాట్సాప్ ను ఓపెన్ చేసి, ఇప్పుడు పైన సేవ్ చేసుకున్న నెంబర్ పై క్లిక్ చేయండి.
Step 3 : ఈ నెంబర్ కు Hi లేదా Namaste అని పంపించండి.
Step 4 : రిప్లై ద్వారా మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. అందులో Digilocker Services అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
Step 5 : ఇప్పుడు మీకు Digilocker అకౌంట్ ఉందా అని అడిగినప్పుడు Yes ను ఎంచుకోండి.
Step 6 : ఇప్పుడు మీ ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేయండి. మీ ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ కి ఓటిపి వస్తుంది.
Step 7 : OTP ను ఎంటర్ చేసి, వెరిఫై చెయ్యండి.
Step 8 : తద్వారా మీ Digilocker అకౌంట్ లో ఉన్న డాక్యుమెంట్స్ మొత్తం లిస్ట్ మీకు అక్కడ కనిపిస్తుంది.
Step 9 : ఇప్పుడు ఆధార్ కు సంబంధించిన డాక్యుమెంట్ పై క్లిక్ చేయండి.
Step 10 : మీ ఆధార్ కార్డ్ పిడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అవడం జరుగుతుంది.
🪪 Aadhaar Card WhatsApp Download 2026
మీ Aadhaar Card ను WhatsApp ద్వారా Download చేసుకోవడానికి క్రింది బటన్‌పై క్లిక్ చేయండి.
📲 WhatsApp ద్వారా Download చేసుకోండి| 📌 ముఖ్యమైన లింక్స్ | 🔗 క్లిక్ చేయండి |
|---|---|
| 📱 Aadhaar Mobile Number Update Online 2026 | Update Details |
| 📸 Aadhaar Photo Update Online 2026 | View Details |
WhatsApp ద్వారా ఆధార్ పిడిఎఫ్ పొందవచ్చా?
అవును. వాట్సాప్ సేవలో డిజి లాకర్ సర్వీసెస్ ద్వారా ఆధార్ డాక్యుమెంట్ ను పొందే విధానం ఇప్పుడు అందుబాటులో ఉంది. తద్వారా ఆధార్ పిడిఎఫ్ సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చును.
WhatsApp MyGov Helpdesk Number ఏంటి?
+91-9013151515
ఆధార్కు మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలా?
అవును. ఆధార్ కు మొబైల్ నెంబర్ తప్పనిసరిగా లింక్ అయ్యి ఉండాలి. ఎందుకంటే ఈ ప్రక్రియలో ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకునే సమయంలో ఆధార్ కి లింక్ అయ్యి ఉన్న మొబైల్ నెంబర్ కు వచ్చే ఓటిపితో వెరిఫై చేయాలి.
Tags: Aadhaar Card Download, Aadhaar WhatsApp Download, Aadhaar PDF Download, Aadhaar Card Online, DigiLocker Aadhaar, MyGov Helpdesk, Aadhaar Download 2026
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇