
Bank Account KYC Update Online 2026: ఇంటి నుంచే KYC Update చేసుకునే Complete Process
Bank Account KYC Update Online 2026: మీ బ్యాంక్ ఖాతాకు KYC లేదా Re-KYC చేయాల్సి ఉందా? బ్యాంక్ అందించే సదుపాయాన్ని బట్టి మొబైల్ బ్యాంకింగ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇంటి నుంచే KYC అప్డేట్ చేసుకోవచ్చు. అది ఎలా.. ఏంటి .. వంటి పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.
Overview Of Bank Account KYC Update Online 2026
| Service Name | Bank Account KYC |
| Regulatory Authority | Reserve Bank of India (RBI) |
| Updation Mode | Online/Offline |
| Requirements | PAN Card, Registered Mobile Number |
KYC అంటే ఏమిటి?
KYC అంటే “Know Your Customer”. బ్యాంకు తన కస్టమర్ ఎవరు, వారి గుర్తింపు మరియు అవసరమైన వివరాలు సరైనవేనా అనే విషయాలను ధృవీకరించే ప్రక్రియను కేవైసీ అంటారు. మీరు కొత్తగా బ్యాంక్ అకౌంట్ తెరిచేటప్పుడు కేవైసీ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇప్పటికే ఉన్న ఖాతాదారులు కూడా బ్యాంక్ నిబంధనల ప్రకారం నిర్దిష్ట సమయంలో Re-KYC చేయాల్సి రావచ్చు.
Re-KYC అంటే ఏమిటి?
ఇప్పటికే మీకు బ్యాంక్ అకౌంట్ ఉంది. మీరు అకౌంట్ ఓపెనింగ్ సమయంలో కేవైసీ పూర్తి చేసి ఉంటారు. ఆ తర్వాత కొంతకాలానికి మీ KYC వివరాలను మళ్ళీ పరిశీలించి, అవసరమైతే అప్డేట్ చేయడానికి రీ-కెవైసీ అంటారు.
KYC ఎందుకు అవసరం?
KYC ద్వారా బ్యాంకులు తమ కస్టమర్లను సరిగ్గా గుర్తించగలుగుతాయి. KYC యొక్క ప్రధాన ఉద్దేశాలు క్రింద ఇవ్వబడినవి.
- కస్టమర్ గుర్తింపును ధ్రువీకరించడం
- బ్యాంకింగ్ వ్యవస్థలో మోసాలను తగ్గించడం
- అక్రమ లావాదేవీలను అరికట్టడంలో సహాయపడటం
- కస్టమర్ వివరాలను ప్రస్తుతానికి అనుగుణంగా ఉంచడం
- బ్యాంకింగ్ నిబంధనలను పాటించడం.
Requirements
కేవైసీ అప్డేట్ చేసే సమయంలో అవసరమయ్యే ఏమేమి అవసరమవుతాయో ఇప్పుడు చూద్దాం.
- Identity Proof
- PAN Card
- Registered Mobile Number.
How To Update KYC
మీరు మీ SBI అకౌంట్ కు KYC అప్డేట్ అనేది నాలుగు విధాలుగా చేసుకోవడానికి సౌకర్యం ఉంది. అందులో మీకు ఏది సులభంగా ఉంటే దానిని ఎంచుకోండి.
1. SBI Yono App
Step 1 : ముందుగా మీ మొబైల్ లో SBI Yono App లేదా అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్ చేయండి.
Step 2 : హోం పేజీలో ఉన్న మెనూ పై క్లిక్ చేసి, “Update KYC”పై క్లిక్ చేయండి.
Step 3 : ఇప్పుడు మీ అకౌంట్ నెంబర్ ను ఎంటర్ చేసి, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు వచ్చిన OTP ను కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
Step 4 : ఆ తర్వాత PAN నెంబర్ ను ఎంటర్ చేసి, అలాగే మీ పేరు ను కూడా ఎంటర్ చేయండి.
Step 5 : ఇప్పుడు మీకు మీ వివరాలకు సంబంధించిన పేజీ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ Change ఆప్షన్ పై క్లిక్ చేయండి.
Step 6 : మీరు మార్చుకోవాలి అనుకున్న వివరాలను ఎంటర్ చేయండి, ఆ తర్వాత మళ్ళీ మీ మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది. దానిని ఎంటర్ చేసి ➡️ బటన్ పై క్లిక్ చేయండి.
2. Internet Banking Online
Step 1 : Internet Banking అనగా గూగుల్ లో మీ నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగిన్ అవ్వండి.
Step 2 : My Accounts లేదా Profile పైన క్లిక్ చేయండి.
Step 3 : తరువాత Update Kyc అనే ఆప్షన్ ఉంటుంది క్లిక్ చేయండి.
Step 4 : అక్కడ మీకు సంబంధించిన వివరాలన్నీ వెరిఫై చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
Step 5 : అంతే ఫ్రెండ్స్ అని చెప్పిన విధంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మీ అకౌంట్ అనేది కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చును.
3. SBI ATM
Step 1 : ముందుగా మీకు దగ్గరలో ఉన్న SBI ATM కు వెళ్ళండి.
Step 2 : ATM Machine లో మీ కార్డ్ ను పెట్టిన తర్వాత డిస్ప్లే లో మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో Banking ను ఎంచుకోండి.
Step 3 : ఆ తరువాత Services పై క్లిక్ చేసి, KYC Update పై క్లిక్ చేయండి.
Step 4 : ఇప్పుడు మీ వివరాలను Confirm చేసి ప్రక్రియ పూర్తి చేయండి.
4. SBI Branch
మీకు సమీపంలో ఉన్న SBI బ్యాంకుకు వెళ్లి కూడా KYC డాక్యుమెంట్స్ ను సమర్పించి KYC అప్డేట్ సులభంగా పూర్తి చేయొచ్చు.
| 📌 ముఖ్యమైన లింక్స్ | 🔗 క్లిక్ చేయండి |
|---|---|
| 📱 SBI YONO App Download | Download App |
| 🏦 SBI Internet Banking Online | Login / Visit |
| 💼 No Exam Govt Jobs | View Jobs |
Latest Articles 👇
- Bank Account KYC Update Online 2026: ఇంటి నుంచే KYC Update చేసుకునే Complete Process
- Ayushman Bharat Card: వాట్సాప్లో ‘Hi’ పంపితే 5 లక్షల ఆయుష్మాన్ భారత్ కార్డ్
- East Coast Railway Apprentice Recruitment 2026: 10th Pass వారికి Golden Chance
- Latest Scholarships 2026: SBI Asha, HDFC ECSS & Mahindra Scholarships – విద్యార్థులకు భారీ Scholarship అవకాశాలు
- Postal GDS Schedule II Notification 2026: పరీక్ష లేకుండా పోస్ట్ ఆఫీస్ లో 23,563 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్
KYC అంటే ఏమిటి?
KYC(Know Your Customer) అనేది బ్యాంకు తన కస్టమర్ గుర్తింపు, చిరునామా మరియు ఇతర అవసరమైన వివరాలను ధృవీకరించే ప్రక్రియ.
2026 లో ప్రతి ఒక్కరూ KYC చేయాలా?
అవసరం లేదు. మీ KYC due అయి ఉంటే లేదా బ్యాంక్ అప్డేట్ చేయమని సూచిస్తే Re-KYC చేయాలి.
KYC ఆన్లైన్ లో చేయవచ్చా?
అవును. మీ బ్యాంకు ఆన్లైన్ ఫెసిలిటీ అందిస్తే మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ లేదా ఇతర అనుమతించబడిన డిజిటల్ సేవల ద్వారా చేయవచ్చు.
KYC అప్డేట్ కోసం ఏ డాక్యుమెంట్స్ అవసరం?
బ్యాంకును బట్టి మారవచ్చు. సాధారణంగా ఆధార్, పాన్ లేదా ఇతర అఫీషియల్ valid డాకుమెంట్స్ అవసరం కావచ్చు.
TAGS : Bank KYC Update 2026, Bank Account KYC Update, KYC Update Online, Bank KYC Update Online 2026, KYC Update Process, Bank Account Update 2026, Online KYC
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇