
NTR Bharosa Pension 2026: 3 Lakh మందికి కొత్త పింఛన్లు – ఎవరికీ వస్తాయి? పూర్తి వివరాలు
NTR Bharosa Pension 2026 : ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్తగా సుమారు 3 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేసే దిశగా ప్రభుత్వం కార్యచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సెప్టెంబరు నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.
Overview Of NTR Bharosa Pension 2026
| Name Of The Scheme | NTR Bharosa Pension Scheme |
| State | Andhra Pradesh |
| New Pensions Proposed | 3 lakhs |
| Widow Pension Beneficiaries | 1.50 lakh |
| Senior Citizen Beneficiaries | 1.50 lakh |
| Application Starts | September 7వ తేదీ నుండి |
ఆంధ్రప్రదేశ్ లో పింఛన్ కోసం ఎదురుచూస్తున్న అర్హులైన వారికి ప్రభుత్వం త్వరలో శుభవార్త అందించే అవకాశం ఉంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద కొత్తగా 3 మూడు లక్షల మందిని పింఛన్ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కొత్త పెన్షన్ల మంజూరులో వృద్ధులు, వితంతువులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ రెండో వారం నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఆ తర్వాత అర్హతను పరిశీలించి. తరువాత నెల అయిన అక్టోబర్ నుంచి పెన్షన్లు అందించేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తుంది.
మొదటి ప్రాధాన్యత ఎవరికి?
కొత్తగా మంజూరు చేయనున్న పింఛన్లలో మొదటి దశలో వృద్ధులు మరియు వితంతులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ప్రాథమిక అంచనాల ప్రకారం మొత్తం 3 లక్షల కొత్త పింఛన్లలో:
- సుమారు 1.50 లక్షల పింఛన్లు వితంతువులకు,
- సుమారు 1.50 లక్షల పింఛన్లు వృద్ధులకు.
వితంతువులకు కొత్త పింఛన్లు
సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ఆధారంగా చేసుకొని రాష్ట్రంలో పింఛన్లకు అర్హత కలిగిన వితంతువుల సంఖ్యను అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది ఇప్పటికే అందుబాటులో ఉన్న వివరాలను వివిధ స్థాయిలో పరిశీలించి అర్హుల సంఖ్యను అంచనా వేస్తున్నట్లు సమాచారం. దాదాపు 1.50 లక్షల మంది వితంతువులు అర్హుల లిస్టులో ఉన్నట్లు తెలుస్తుంది. దరఖాస్తులు స్వీకరించిన తర్వాత మరోసారి అర్హతలను పరిశీలించి ప్రభుత్వ నిబంధనలను అనుకూలంగా ఉన్న వారిని తుది జాబితాలోకి తీసుకునే అవకాశం ఉంది.
వృద్ధులకు కూడా పెద్ద సంఖ్యలో అవకాశం
కొత్తగా కేటాయించనున్న పింఛన్లు మరో ముఖ్యమైన భాగాన్ని వృద్ధులకు అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. గతంలో అర్హత ఉన్నప్పటికీ వివిధ కారణాలవల్ల పింఛను పొందలేకపోయిన వృద్ధుల వివరాలను కూడా అధికారులు సేకరించినట్లు తెలుస్తుంది. అలాంటి వారిలో ప్రస్తుతం నిబంధనలు ప్రకారం అర్హత కలిగిన వారిని గుర్తించి కొత్త పింఛన్లలో అవకాశం కల్పించి అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
దివ్యాంగుల పింఛన్ల పై పత్యేక పరిశీలన
దివ్యాంగులు పింఛన్ల విషయంలో కూడా ప్రభుత్వం మరింత కఠినంగా పరిశీలన చేయాలని భావిస్తున్నట్లు సమాచారం కొంతమంది అర్హతలు లేని వ్యక్తులకు కూడా వైకల్య ధ్రువీకరణ పత్రాలు జారీ అయినట్లు పరిశీలనలో గుర్తించిన నేపథ్యంలో నిజమైన అర్హులను గుర్తించడం ఎలా అనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది అందువలన దివ్యాంగుల కేటగిరీలో పింఛన్ మంజూరుకు సంబంధించిన నిబంధనలు ధ్రువీకరణ ప్రక్రియ వైద్య పర్యమైన పరిశీలన వంటి అంశాల్లో ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు తీసుకురావచ్చు అని భావిస్తున్నారు.
ఇతర కేటగిరీలకు పింఛన్లు ఎప్పుడు, ఎవరికి అవకాశం?
కొత్తగా మంజూరు చేయనున్న పింఛన్లలో వృద్ధులు వితంతువులకు తొలి ప్రాధాన్యం ఇచ్చిన తరువాత ఇతర కేటగిరీల అర్హులకు దశలవారీగా పింఛన్లు మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా వృత్తి ఆధారంగా జీవనం సాగించే పేద కుటుంబాలకు సంబంధించిన పింఛన్ కేటగిరీల పై కూడా అధికారులు వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది.
- చేనేత కార్మికులు
- డప్పు కళాకారులు
- చర్మకారులు
- గీత కార్మికులు.
అర్హత పరిశీలన ఎలా ఉండొచ్చు?
కొత్త పింఛన్ల ఎంపికలో కుటుంబ వివరాలు ఆదాయం, వయస్సు, సామాజిక పరిస్థితి ఇప్పటికే ఏదైనా ప్రభుత్వ ప్రయోజనం పొందుతున్నారా లేదా వంటి అంశాలను పరిశీలించే అవకాశం ఉంది. ప్రభుత్వం వద్ద ఉన్న కుటుంబ సర్వే డేటాను ఆధారంగా తీసుకోవడంతో పాటు అవసరమైన చోట స్థానిక స్థాయిలో కూడా వివరాలను ధ్రువీకరించే అవకాశం ఉంటుంది. అంటే దరఖాస్తు చేయడం మాత్రమే పింఛన్ మంజూరుకు హామీ కాదు. ప్రభుత్వం నిర్ణయించిన అర్హత ప్రమాణాలను పూర్తిగా నెరవేర్చిన వారికే తుది ఎంపికలలో అవకాశం లభిస్తుంది.
సెప్టెంబర్ లో దరఖాస్తులకు అవకాశం
కొత్త పింఛన్ల కోసం సెప్టెంబర్ 07వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దరఖాస్తులు స్వీకరించిన తరువాత సంబంధిత అధికారులు వాటిని పరిశీలించి అర్హత ఉన్న వారిని తుది జాబితాలు చేసే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ పూర్తి అయిన తరువాత అక్టోబర్ నుంచి కొత్త పింఛన్ల పంపిణీ ప్రారంభించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే దరఖాస్తు తేదీలు, ఎక్కడ దరఖాస్తు చేయాలి, అవసరమైన పత్రాలు ఏమిటి ప్రభుత్వం అధికారికి ప్రకటన విడుదల చేసిన తరువాత పూర్తి స్పష్టత వస్తుంది.
👵 NTR Bharosa Pension 2026
కొత్త పెన్షన్ కోసం కావలసిన Required Documents, అర్హతలు మరియు అప్లై చేసే విధానం పూర్తి వివరాలు తెలుసుకోవడానికి క్రింది బటన్‌పై క్లిక్ చేయండి.
📄 Pension Documents పూర్తి వివరాలు.
📄 NTR Bharosa కొత్త పెన్షన్ అప్లికేషన్
NTR Bharosa కొత్త పెన్షన్ Application Formను డౌన్‌లోడ్ చేసుకోవడానికి క్రింది బటన్‌పై క్లిక్ చేయండి.
📥 NTR Bharosa Application Downloadకొత్తగా ఎన్ని పింఛన్లు ఇవ్వనున్నారు?
ప్రాథమికంగా సుమారు మూడు లక్షల కొత్త సామాజిక భద్రత పింఛన్లు మంజూరు చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
మొదట ఏ కేటగిరిలకు పింఛన్లు ఇస్తారు?
తొలి దశలో వృద్ధులు, వితంతువులకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఇతర కేటగిరీలకు కూడా పింఛన్ వస్తుందా?
అవును. అందుబాటులో ఉన్న పింఛన్ల సంఖ్య, అర్హుల సంఖ్యను బట్టి ఇతర కేటగిరీలకు కూడా విడతల వారీగా పింఛన్లు మంజూరు చేసే అవకాశం ఉంది.
TAGS : NTR Bharosa Pension 2026, NTR Bharosa New Pensions, AP New Pensions 2026, AP Pension Scheme 2026, NTR Bharosa Pension, AP Government Schemes 2026, New Pension Applications AP
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇