
Ayushman Bharat Card: వాట్సాప్‌లో ‘Hi’ పంపితే 5 లక్షల ఆయుష్మాన్ భారత్ కార్డ్
Ayushman Bharat Card: ఆయుష్మాన్ భారత్-ప్రధానమంత్రి జన ఆరోగ్య యజన కింద అర్హత ఉన్న లబ్ధిదారులకు ఆరోగ్య సేవలకు ఆర్థిక రక్షణ కల్పిస్తున్నారు. అయితే ఈ కార్డు ను మీ మొబైల్ లో ఉండే వాట్సాప్ ద్వారా సులభంగా పొందవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం.
Overview Of Ayushman Bharat Card
ఆయుష్మాన్ భారత్ కార్డ్ అనేది భారత ప్రభుత్వం అందించే ఆరోగ్య భద్రతా పథకం. అర్హత ఉన్న కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం నుండి సంవత్సరానికి 5 లక్షల వరకు ఆస్పత్రి చికిత్స కోసం ఆరోగ్య కవరేజ్ లభిస్తుంది. పేద మరియు ఆర్థికంగా బలహీనమైన కుటుంబాలకు తీవ్రమైన అనారోగ్యం వచ్చినప్పుడు డబ్బు కారణంగా చికిత్స ఆగిపోకుండా చూడటమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. డబ్బు లేకపోవడం వల్ల నాణ్యమైన సెకండరీ మరియు టెరిటరీ హెల్త్ కేర్ పొందలేని పరిస్థితిని తగ్గించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం.
| Name Of the Scheme | Ayushman Bharat-Pradhan Mantri Jan Arogya Yojana(AB-PMJAY) |
| Launched By | Government Of India |
| Treatment Method | Cashless treatment at empanelled private hospitals |
| Coverage Amount | రూ.5 lakhs per family per year |
What is Ayushman Bharat Card
ఆయుష్మాన్ భారత్ కార్డ్ అనేది భారత ప్రభుత్వ పథకం అయిన ఆయుష్మాన్ భారత్-ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కి అర్హత ఉన్న లబ్ధిదారులను గుర్తించడానికి ఉపయోగించే ఆరోగ్య కార్డు. అర్హత ఉన్న వ్యక్తి లేదా కుటుంబానికి ప్రభుత్వం అందించే ఆరోగ్య కవరేజ్ ను ఉపయోగించుకోవడానికి ఈ కార్డు సహాయపడుతుంది.
Ayushman Sarathi WhatsApp Chatbot
ఈ Ayushman Sarathi WhatsApp Chatbot అనేది ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకానికి సంబంధించిన సేవలను వాట్సాప్ ద్వారా అందించడానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఇందులో ఈ పథకానికి సంబంధించి Eligibility, Ayushman Card, e-KYC, Nearby Hospitals వంటి సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు.
Ayushman Sarathi WhatsApp Chatbot కోసం 7290823838 కి వాట్సాప్ లో “Hi” అని పంపితే ఈ ఆయుష్మాన్ భారత్ పథకానికి సంబంధించి అందుబాటులో ఉన్న సేవలను పరిశీలించవచ్చు.
Benefits Of Ayushman Bharat
ఆయుష్మాన్ భారత్ పథకం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందులో కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం.
- ఖరీదైన వైద్య ఖర్చుల నుంచి రక్షణ
- పేదలకు మంచి ఆసుపత్రి చికిత్స అందించడం
- రూ.5 లక్షల వరకు ఆరోగ్య రక్షణ
- చికిత్స సమయంలో స్వంత డబ్బు ఖర్చు తగ్గించడం.
ఏ చికిత్సలకు ఉపయోగపడుతుంది?
పరీక్ష లేకుండా పోస్ట్ ఆఫీస్ లో 23,563 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్
ఈ ఆయుష్మాన్ భారత్ పథకం కింద అనుమతించబడిన చికిత్సలో సాధారణంగా ఈ క్రింద తెలిపిన వాటికి అనుమతించబడుతుంది.
- ఆస్పత్రిలో చేరి చేసే చికిత్సలు
- శస్త్ర చికిత్సలు
- ఇక చికిత్స
- వైద్య పరీక్షలు
- మందులు మరియు Medical Consumables
- కొన్ని Day-Care Procedures
- చికిత్సకు ముందు మరియు తర్వాత సంబంధించిన ఖర్చులు.

Step 1 : ముందుగా మీ మొబైల్ లో WhatsApp ను ఓపెన్ చేయండి.
Step 2 : 7290823838 నెంబర్ కు వాట్సాప్ చాట్ ఓపెన్ చేయండి.
Step 3 : ఇప్పుడు చాట్ లో “Hi” అని మెసేజ్ టైప్ చేసి పంపండి.
Step 4 : Chatbot నుండి వచ్చే ఆప్షన్స్ ను పరిశీలించండి.
Step 5 : మీకు అవసరమైన Eligibility Check, Ayushman Card, e-KYC, Nearby Hospitals వంటి వంటి సేవను ఎంచుకోండి.
Step 6 : Chatbot సూచించే విధంగా తదుపరి వివారాలను పూర్తి చేయండి.
🏥 Ayushman Bharat Card Download
ఆయుష్మాన్ భారత్ కార్డ్ డౌన్‌లోడ్ కోసం WhatsApp ద్వారా సంప్రదించండి.
💬 WhatsApp లో Ayushman Card DownloadFAQS
Ayushman Sarathi WhatsApp నెంబర్ ఏంటి?
Ayushman Sarathi WhatsApp కోసం ఇచ్చిన నెంబర్ 7290823838
WhatsApp ద్వారా Eligibility Check చేయవచ్చా?
అవును. ఇచ్చిన సమాచారం ప్రకారం Ayushman Sarathi WhatsApp Chatbot లో Eligibility Check సేవా అందుబాటులో ఉంది.
e-KYC సేవ వాట్సాప్ లో ఉందా?
అవును. Ayushman Sarathi WhatsApp Chatbot లో e-KYC సేవ కూడా అందుబాటులో ఉంది.
కుటుంబంలో ఎంతమంది ఉండాలి?
సాధారణంగా PM-JAY లో కుటుంబ సభ్యుల సంఖ్య పై మరియు వయసు పై పరిమితి లేదు. అర్హత ఉన్న కుటుంబంలోని సభ్యులు పథకం ప్రయోజనం పొందవచ్చు.
💼 No Exam Govt Jobs 2026
రాత పరీక్ష లేకుండా అందుబాటులో ఉన్న Government Jobs తాజా నోటిఫికేషన్లు, అర్హతలు మరియు దరఖాస్తు వివరాలను చూడటానికి క్రింది బటన్‌పై క్లిక్ చేయండి.
🔍 Latest Govt Jobs Check HereTags: Ayushman Bharat, PM-JAY, Ayushman Card, Ayushman Sarathi, Ayushman Card WhatsApp, Ayushman Card e-KYC, Health Scheme, Government Schemes
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇