AP Farmer Registry 2026: రైతులకు 11 Digit Farmer ID తప్పనిసరి? ఆన్లైన్లో నమోదు, స్టేటస్ చెక్ పూర్తి వివరాలు!

AP Farmer Registry 2026

AP Farmer Registry 2026: రైతులకు 11 Digit Farmer ID తప్పనిసరి? ఆన్లైన్లో నమోదు, స్టేటస్ చెక్ పూర్తి వివరాలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని రైతులకు ముఖ్యమైన సమాచారం. కేంద్ర ప్రభుత్వ అమలు చేస్తున్న Agristack Farmer Registry కార్యక్రమంలో భాగంగా రాష్ట్రాల్లోని రైతులకు వివరాలను డిజిటల్ విధానంలో నమోదు చేస్తున్నారు ఇందులో భాగంగా రైతులకు ప్రత్యేకమైన Farmer ID కేటాయిస్తారు.

WhatsApp Group Join Now

ఈ Farmer ID ద్వారా రైతులకు ఆధార్ అధికారిక గుర్తింపు, భూమి వివరాలు, వ్యవసాయ సమాచారాన్ని ఒకే డిజిటల్ వ్యవస్థలో అనుసంధానం చేస్తున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, పంటల బీమా, రైతులకు అందించే ఇతర సేవలను మరింత సులభంగా అందించడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది.

ముఖ్యంగా PM-KISAN, పంటల బీమా వంటి పథకాలు లబ్ధిదారులు వివరాలు ధ్రువీకరణకు Farmer Registry ప్రాధాన్యం పెరుగుతుంది.

AP Farmer Registry 2026 – Overview

అయితే PM Farmer Registry కోసం ఎలా నమోదు చేసుకోవాలి? ఏ పత్రాలు కావాలి? మొబైల్ లోనే అప్డేట్ చేయవచ్చా? Farmer ID Status ఎలా తెలుసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

వివరాలుసమాచారం
కార్యక్రమం పేరుAP Farmer Registry
ప్రధాన కార్యక్రమంAgristack
నిర్వహణకేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వం
గుర్తింపు సంఖ్యFarmer ID
Farmer ID నిర్మాణం11 అంకెలు
ముఖ్య ఉద్దేశంరైతుల డిజిటల్ గుర్తింపు
అర్హులుభూమి కలిగిన రైతులు
దరఖాస్తు విధానంOnline / సహాయక కేంద్రాలు
అవసరమైన పత్రాలుఆధార్, భూమి వివరాలు
అధికారిక వెబ్ సైట్

What Is AP Farmer Registry?

AP Farmer Registry అనేది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన Agristack కార్యక్రమంలో భాగం. ఈ విధానం ద్వారా రైతుల వ్యక్తిగత గుర్తింపు వివరాలను, వారి భూమి రికార్డులను డిజిటల్ పద్ధతుల్లో అనుసంధానం చేస్తారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయి అధికారులు ధ్రువీకరించిన తర్వాత రైతులకు ప్రత్యేకమైన Farmer ID కేటాయిస్తారు. ఈ గుర్తింపు సంఖ్య ద్వారా రైతుల వివరాలను వివిధ వ్యవసాయ సేవలకు అనుసంధానం చేయడం సులభం అవుతుంది.

ముఖ్యమైన విషయం : Farmer ID అనేది వ్యక్తిగత రైతులకు సంబంధించిన గుర్తింపు సంఖ్య. Farmer ID అనేది భూమి లేదా వ్యవసాయ భూకంధానికి సంబంధించిన గుర్తింపు ఈ రెండు వేర్వేరు.

Farmer Registry ఎందుకు ముఖ్యం?

రైతులకు ప్రభుత్వం పథకాలు ఉపయోగిణాలు అందించేటప్పుడు వారి గుర్తింపు, భూమి వివరాలను ధ్రువీకరించడం చాలా ముఖ్యం.

Farmer Registry వల్ల:

  • రైతుల వివరాలను డిజిటల్ విధానంలో నమోదు చేయవచ్చు.
  • భూమి వివరాలను రైతుల గుర్తింపుతో అనుసంధానం చేయవచ్చు.
  • అర్హులైన లబ్ధిదారులను గుర్తించడం సులభం అవుతుంది.
  • వ్యవసాయ పథకాల అమలులో పారదర్శకత పెరుగుతుంది.
  • పంటల బీమా, వ్యవసాయ సేవలకు అవసరమైన వివరాలను సులభంగా ధ్రువీకరించవచ్చు.

Farmer Registry ద్వారా ఏ పథకాల్లో ఉపయోగం?

Farmer Registry ద్వారా రైతులకు సంబంధించిన ప్రభుత్వ సేవలను అనుసంధానం చేయడానికి అవకాశం ఉంటుంది.

  1. PM -KISAN పథకం.
  2. అన్నదాత సుఖీభవ పథకం
  3. పంటల బీమా పథకం.
  4. వ్యవసాయ రుణాలకు సంబంధించిన సేవలు.
  5. వ్యవసాయ యంత్ర పరికరాల సబ్సిడీలు. సూక్ష్మ సేద్యం, వ్యవసాయ అనుబంధ సేవలు.
  6. సూక్ష్మ సేద్యం, వ్యవసాయ అనుబంధ సేవలు.

అయితే Farmer ID ఉన్నంత మాత్రాన ఈ పథకాన్నిటికీ అర్హత లభించదు. ప్రతి పథకానికి సంబంధించిన ప్రత్యేక అర్హతలు, ప్రభుత్వ మార్గదర్శకాలు వర్తిస్తాయి.

Documents Required for AP Farmer Registry

Fermer Registry కోసం నమోదు చేసుకుని సమయంలో సాధారణంగా ఈ పత్రాలు, వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలి.

  1. ఆధార్ కార్డు.
  2. ఆధార్ కార్డు లింక్ అయినా మొబైల్ నెంబర్
  3. పట్టాదారుని పాస్ బుక్
  4. భూమికి సంబంధించిన సర్వే నెంబరు వివరాలు.
  5. 1-B/ అడంగల్ వివరాలు.
  6. బ్యాంకు ఖాతా వివరాలు అవసరమైతే.

భూమి రికార్డుల్లో పేరు, విస్తీర్ణం లేదా ఇతర వివరాల్లో తప్పులు ఉంటే ముందుగా సంబంధిత రెవిన్యూ అధికారాలను ప్రతిపాదించాలి.

HOW to Apply AP Farmer Registry Online?

రైతులు అధికారిక వెబ్ సైట్ ద్వారా సహాయంగా Farmer Registry కోసం నమోదు చేసుకునే అవకాశం ఉంది.

Step 1: ముందుగా అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయండి.

Step 2: Farmer Registration లేదా Farmer Signup EKYC అప్లికేషన్ను ఎంచుకోండి.

Step 3: ఆధార్ వివరాలు నమోదు చేసి సూచించిన విధంగా EKYC పూర్తి చేయండి.

Step 4: ఆధార్కు లింకు అయిన మొబైల్ నెంబర్ కు వచ్చే OTP ద్వారా ధ్రువీకరణ పూర్తి చేయండి.

Step 5: స్క్రీన్ పై కనిపించే వ్యక్తిగత వివరాలను పరిశీలించండి.

Step 6: మీ పేరుతో అనుసంధానమైన భూమి వివరాలను పరిశీలించి, సరైన భూమిని క్లెయిమ్ చేయడానికి సూచించిన ప్రక్రియ అనుసరించండి.

Step 7: అవసరమైన సమ్మతి (Consent) ఇచ్చిన దరఖాస్తు సబ్మిట్ చేయండి.

Step 8: నమోదు పూర్తయిన తర్వాత వచ్చే Enrollment ID ను భద్రపరచుకోండి

భూమి వివరాల పరిశీలన, అధికారాల ఆమోదం పూర్తయిన తర్వాత Farmer ID జనరేట్ అవుతుంది.

గ్రామ సచివాలయం ద్వారా Farmer Registry ఎలా చేయాలి?

ఆన్లైన్లో సహాయం నమోదు చేసుకోవడం తెలియని రైతులు గ్రామస్థాయిలో అందుబాటులో ఉన్న వ్యవసాయ శాఖ సహాయకులు లేదా సంబంధిత Farmer Registry సేవా కేంద్రాన్ని సంప్రదించవచ్చు. వారు ఆధార్ EKYC, భూమి వివరాల పరిశీలన, నమోదు ప్రక్రియలో సహాయం చేస్తారు.

రిజిస్ట్రేషన్ సమయంలో మీ పేర్లతో ఉన్న భూమి వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోండి.

How to Check AP Farmer Registry Status?

Farmers Registry కోసం అప్లై చేసిన తర్వాత మీ దరఖాస్తు ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చు.

Ap Farmer Registry status check online
  1. AP Farmer Registry అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్ చేయండి.
  2. Farmer Login లేదా అందుబాటులో ఉన్న Enrollment Status అప్లికేషన్ ఎంచుకోండి.
  3. అవసరమైన Enrollment ID లేదా అడిగిన వివరాలను నమోదు చేయండి.
  4. సూచించిన విధంగా ధ్రువీకరణ పూర్తి చేయండి.
  5. మీ దరఖాస్తు స్థితిని పరిశీలించండి.

పోస్టల్ లో కనిపించే అప్లికేషన్లు మారవచ్చు. స్టేటస్ ఆన్లైన్ లో కనిపించకపోతే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారి లేదా గ్రామ సచివాలయాన్ని సంప్రదించండి.

Farmer Registry Status-Meaning

దరఖాస్తు స్థితిని బట్టి తదుపరి చర్యలు తీసుకోవాలి.

  • Pending: మీ దరఖాస్తు పరిశీలనలో ఉంది.
  • Approved: మీ నమోదు ఆమోదించబడింది.
  • Rejected: దరఖాస్తులో ఏదైనా సమస్య ఉన్నట్లు సూచించవచ్చు. కారణాన్ని పరిశీలించి సంబంధిత అధికారిని సంప్రదించాలి.

Important Instructions for Farmer

రైతులు Farmer Registry పూర్తి చేసుకునేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.

  • ఆధార్ లోని పేరు, భూమి రికార్డుల్లోని పేరు సరిపోతున్నాయో చూడాలి.
  • భూమి విస్తీర్ణం, సర్వే నెంబర్లు జాగ్రత్తగా పరిశీలించాలి.
  • OTP ను ఇతరులకు చెప్పకూడదు.
  • నమోదు పూర్తయిన తర్వాత Enrollment ID ను భద్రపరచుకోవాలి.
  • భూమి వివరాల్లో సమస్య ఉంటే సంబంధిత రెవిన్యూ అధికారాలను సంప్రదించాలి.
  • అనధికారిక వెబ్ సైట్లు, నకిలీ యాపిల్లో ఆధార్ వివరాలు నమోదు చేయకూడదు.
🌾 Farmer Registry – ముఖ్యమైన లింకులు

ఫార్మర్ రిజిస్ట్రేషన్ Apply & Status Checking Process

రైతులకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మరియు స్టేటస్ ఎలా చెక్ చేయాలో తెలియకపోతే క్రింద ఇచ్చిన లింక్స్ ని క్లిక్ చేసి వీడియో రూపంలో తెలుసుకోండి.

📽️ Farmer Registry Video Guides
Farmer Registry Apply Process ▶ Watch Video
Farmer Registry Status Check ▶ Watch Video

Frequently Asked Questions (FAQs)

1. What is AP Farmer Registry?

ఆంధ్రప్రదేశ్ రైతుల గుర్తింపు భూమి వివరాలు డిజిటల్ విధానంలో నమోదు చేసే Agristack కార్యక్రమమే Farmer Registry.

2. How Many Digits are there in Farmer ID?

Agristack అధికారిక FAQ ప్రకారం Farmer ID లో 11 అంకెలు ఉంటాయి. 14 అక్షరాల Farmer ID వేరే గుర్తింపు సంఖ్య.

3. Is Farmer Registry mandatory for PM Kisan?

ఆంధ్రప్రదేశ్ లో PM -KISAN లబ్ధికి Farmer Registry ప్రాధాన్యం పెరిగింది తాజా ప్రభుత్వం సూచనల ప్రకారం నమోదు పూర్తి చేసుకోవాలి. పథకానికి వర్తించే ప్రస్తుత నిబంధనలును అధికారికంగా నిర్ణయించుకోవాలి.

4. What Documents are required for Farmer Registry?

ఆధార్ కార్డ్, ఆధార్ కార్డుకు లింక్ అయినా మొబైల్ నెంబర్, పట్టాదారుని పాస్ బుక్, భూమి రికార్డులు అవసరం కావచ్చు.

5. Can I Apply for Farmer Registry online?

అవును. Ap Farmer Registry అధికారిక వెబ్ సైట్ ద్వారా EKYC, భూమి వివరాల నమోదు ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

TAGS : AP Farmer Registry, Farmer ID AP, AgriStack, Farmer Registry 2026, AP Farmers, Farmer ID Registration, PM Kisan, Andhra Pradesh Agriculture, Farmer Status Check, Farmer ID Online

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now

1 thought on “AP Farmer Registry 2026: రైతులకు 11 Digit Farmer ID తప్పనిసరి? ఆన్లైన్లో నమోదు, స్టేటస్ చెక్ పూర్తి వివరాలు!”

Leave a Comment